వైసీపీలోకి షర్మిల..కీలక పదవి ఇస్తామంటూ..!!

ఏపీ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తున్న వార్త ఏంటంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి ( Y.S.

Rajashekhar Reddy ) ముద్దుబిడ్డ వైఎస్ షర్మిల తండ్రి పెట్టిన పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకి లో కీలక పదవి చేపడుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇక వైసిపికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ వేరే పార్టీలో షర్మిల ( Sharmila ) గనుక చేరితే కచ్చితంగా అది వైసీపీకి మైనస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

మరీ ముఖ్యంగా ఆంధ్రా లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఒక్కటైతే వైసీపీ పార్టీ ఒకటి అనే విధంగా ఉంది.ఎన్ని పార్టీలు ఏకమై వచ్చినా కూడా తమని ఏమి చేయలేవని అధికార వైసిపి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఒక రకంగా చెప్పాలంటే వైసిపి ప్రభుత్వానికి భయపడే టిడిపి,జనసేన వంటి పార్టీలు పొత్తులు పెట్టుకొని అధికారంలోకి రావాలని చూస్తున్నారు.అయితే షర్మిల గనుక వేరే పార్టీలోకి వెళ్తే అది వైసిపి కుటుంబానికి మైనస్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.

ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం షర్మిల ని వైసిపి లోకి ఆహ్వానించడం కోసం జగన్మోహన్ రెడ్డి ( Jagan mohan reddy ) అత్యంత సన్నిహితుడు ఆమె దగ్గరికి వెళ్లి రాయబారం జరపడానికి నిశ్చయించుకున్నారట.ఇక సొంత చెల్లి వేరే పార్టీలో తనపై విమర్శలు చేస్తూ ఉంటే కచ్చితంగా తనకు ఓటు బ్యాంకు తగ్గే అవకాశం ఉందని,అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

అయితే గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి జైలు పాలు అయినప్పుడు షర్మిల పార్టీ బాధ్యతలు మొత్తం తన మీద వేసుకొని పాదయాత్రలు చేస్తూ వైసిపి ( YCP ) పార్టీలో కీలక నాయకురాలిగా కొనసాగింది.ఆ తర్వాత జగన్ బయటకి వచ్చి సీఎం అయ్యాక ఆమెను పట్టించుకోలేదనే కోపంతో పార్టీ నుండి బయటికి వచ్చేసినట్టు వార్తలు వినిపించాయి.ఇక తెలంగాణలో పార్టీ పెట్టినప్పటికీ అంతగా కలిసి రాలేదు.

ఇక త్వరలోనే ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోబోతున్నట్టు సమాచారం.

ఇక ఇదంతా పక్కన పెడితే వైసీపీ ప్రభుత్వంలోకి మళ్ళీ తన చెల్లిని ఆహ్వానించడానికి జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిని ఆమె దగ్గరికి పంపాలని చూస్తున్నారట.అంతేకాకుండా ఆమె సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలని భావిస్తున్నారట.అంతేకాకుండా షర్మిల కి కడప ( Kadapa ) లోక్ సభ స్థానం నుండి పోటీ చేసే అవకాశం కూడా కల్పించడానికి సిద్ధమయ్యారట.

ఇక వైరల్ అవుతున్న ఈ న్యూస్ లో ఎంత నిజముందో తెలియదు.కానీ ఈ విషయం తెలిసిన కొంతమంది వైసీపీ అభిమానులు ఇదే నిజమైతే బాగుండు అని మాట్లాడుకుంటున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

మరి నిజంగానే వైసిపి పార్టీ లోకి షర్మిల వస్తుందా లేదా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు