Shanthanu Bhagyaraj Kiki Vijay: 8 ఏళ్ల బ్రేకప్ తర్వాత మళ్లీ లవ్ లో పడ్డాం.. ప్రముఖ నటి కామెంట్స్ వైరల్?

తమిళ నటుడు శాంతను భాగ్యరాజ్( Shanthanu Bhagyaraj ) ప్రస్తుతం మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం( Guntur Karam ) సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

మరొకవైపు కోలీవుడ్ లో వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్నారు భాగ్యరాజ్.

కాగా నటుడు డైరెక్టర్ అయిన భాగ్యరాజ్ కొడుకుగా శాంతను భాగ్యరాజ్ కోలీవుడ్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.మొదట సక్కరకత్తి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

అప్పటి నుంచి తమిళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.ఇటీవలె రావణ కొట్టం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఇటీవలే శాంతను భాగ్యరాజ్, అతని భార్య కికీ విజయ్ తో( Kiki Vijay ) కలిసి ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.తమ ప్రేమ, బ్రేకప్ వంటి అంశాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.2015లోనే వీరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది.ప్రస్తుతం వీరిద్దరికి విత్ లవ్ శాంతను కికీ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది.

Advertisement

ఆ ఛానల్ ద్వారా వారి వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా శాంతను మాట్లాడుతూ.

మేం ప్రేమించుకున్నాం.ఆ తర్వాత బ్రేకప్( Breakup ) అయ్యింది.

దాంతో ఎనిమిదేళ్లు దూరంగా ఉన్నాము.ఒక సందర్భంలో మళ్లీ లవ్ లో పడ్డాము.

గతంలో చిన్నచిన్న విషయాలకే బాగా గొడవపడే వాళ్లం అంటూ ఆ రోజులను గుర్తుచేసుకున్నాం అని అని చెప్పుకొచ్చారు.తరువాత భార్య కికీ మాట్లాడుతూ.నేను శాంతను బాగా ప్రేమించాను.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

ఆయనతో లవ్ లో ఉన్నప్పుడు ఒక ఘటన జరిగింది.ఇప్పటికీ బాగా గుర్తుంది.

Advertisement

శాంతను వేరే అమ్మాయితో కాఫీ షాప్ లో ఉన్నాడని నా ఫ్రెండ్ ఒకరు చూసి కాల్ చేశారు.నేను వెంటనే ఆయనకి ఫోన్ చేసి ఎక్కడున్నారని అడిగాను.

కానీ ఆయన మా నాన్నతో ఉన్నానని అబద్ధం చెప్పాడు.ఇలాంటి ఘటనలతో చిన్నచిన్న గొడవలై పెద్దవిగా మారాయి.

దాంతో బ్రేకప్ చెప్పుకున్నాం.ఎనిమిదేళ్లు విడిపోయాము.

కానీ ఓ షోలో ఇద్దరం కలిసి డాన్స్ చేయాల్సి రావడంతో మళ్లీ ఒక్కటయ్యాము అని చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు