Shanmukh Deepthi Sunaina : దీప్తిని షన్ను మర్చిపోలేదా…దీప్తిని గుర్తు చేసిన నెటిజన్ కి షాకింగ్ రిప్లై ఇచ్చిన షన్ను!

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో యూట్యూబర్స్ షణ్ముఖ్ జస్వంత్( Shanmukh Jaswanth ) దీప్తి సునయన( Deepthi Sunaina ) వంటి వారు ఒకరు.

వీరిద్దరూ ఎన్నో యూట్యూబ్ వీడియోలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇలా వీరిద్దరూ కలిసి పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నటువంటి తరుణంలోని ప్రేమలో పడ్డారు.ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట అనంతరం బ్రేకప్ చెప్పుకున్నారు.

షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమానికి వెళ్లి వచ్చిన తర్వాత దీప్తి తనతో బ్రేకప్ చెప్పుకుంది.

ఇలా బ్రేకప్ చెప్పుకున్న తర్వాత వీళ్లిద్దరూ కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువగానే ఉన్నాయి అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఒకరి పోస్టులకు ఒకరు రెస్పాండ్ కాలేదు అయితే తాజాగా ఒక నెటిజన్ అడిగినటువంటి ప్రశ్నకు షణ్ముఖ్ జస్వంత్ ఇచ్చినటువంటి సమాధానం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ప్రేమికుల దినోత్సవం( Valentines Day ) సందర్భంగా ఒక నేటిజన్ షణ్ముఖ్ ను ప్రశ్నిస్తూ.బ్రేకప్ అయినా ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నావో చెప్పు బ్రో అంటూ ప్రశ్నించారు.

Advertisement

ఈ ప్రశ్నకు షణ్ముఖ్ సమాధానంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమాలోని ఒక పాటకు సంబంధించిన లిరిక్ పోస్ట్ చేశారు.కోరుకున్నది చేయి దాటిపోతే వెళ్లిపోనిలే.బాధపడటం బెంగ పడిపోవడం మనకి రాదసలే అంటూ బదులివ్వడం హాట్ టాపిక్ గా మారింది.

దీంతో పలువురు ఈయన ఇంకా దీప్తి సునయనను మర్చిపోలేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఈయన పూర్తిగా నెగిటివిటీని ఎదుర్కొని బయటకు వచ్చారు.

షణ్ముఖ్ చివరిగా స్టూడెంట్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక దీప్తి మాత్రం పలు సాంగ్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఎంతో బిజీగా ఉన్నారు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు