Shanmukh Mother : నా కొడుకుని విమర్శితే నేనే ఎక్కువ బాధపడతాను.. షణ్ముఖ్ తల్లి కామెంట్స్ వైరల్!

షణ్ముఖ్ జస్వంత్.( Shanmukh Jaswanth ) ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

బిగ్బాస్ హౌస్కి వెళ్ళకముందు వరకు ప్రముఖ యూట్యూబర్ గా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్ జస్వంత్, బిగ్బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి బోలెడంత నెగటివీటిని మూట కట్టుకున్నాడు హౌస్ లోకి వెళ్ళకముందు దీప్తి సున‌య‌న‌తో( Deepthi Sunaina ) ల‌వ్ ట్రాక్‌ న‌డిపాడు.కానీ బిగ్‌బాస్ త‌ర్వాత వ్య‌వ‌హారం బెడిసికొట్టింది.

సిరి హ‌న్మంత్‌తో క్లోజ్‌గా ఉండ‌టంతో ష‌ణ్నుపై నెగెటివిటీ పెరిగింది.త‌ర్వాత దీప్తితో బ్రేక‌ప్ కూడా జ‌రిగింది.

బిగ్‌ బాస్ గేమ్‌లో బ‌లిప‌శువు అయ్యాడు.అనంత‌రం ర్యాష్ డ్రైవింగ్‌తో వార్త‌ల్లోకెక్కాడు.

Advertisement

ఈసారి ఏకంగా గంజాయి తాగుతూ ప‌ట్టుబ‌డ్డాడు.దీంతో పోలీసులు అత‌డిని అరెస్ట్( Shanmukh Arrest ) చేసి జైల్లో పెట్టారు.ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావ్‌.

అంటూ షణ్ముఖ్ ని నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.అయితే అత‌డిపై ఎంత ట్రోలింగ్ జ‌రుగుతున్నా పేరెంట్స్‌, అత‌డి అభిమానులు ఎప్పుడూ అండ‌గా నిల‌బ‌డేవారు.

ఈ ట్రోలింగ్ వ‌ల్ల ష‌ణ్ను కంటే ఆమె అమ్మ ( Shanmukh Mother ) ఎక్కువ బాధ‌ప‌డేది.గ‌తంలో సాక్షికి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.

నా కుమారుడిని ఎందుకంత‌లా విమ‌ర్శిస్తున్నార‌ని బాధేసేది.ష‌ణ్ను క‌న్నా నేనే ఎక్కువ‌గా బాధ‌ప‌డతాను.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?

కానీ అత‌డి ఫ్యాన్స్ చాలా స‌పోర్ట్ చేస్తారు.

Advertisement

అది సంతోషంగా అనిపించేది.నాకు ఆరోగ్యం బాగోలేన‌ప్పుడు ష‌ణ్ను ద‌గ్గ‌రుండి చూసుకున్నాడు.నా భ‌ర్త‌, పిల్ల‌ల ప్రేమ వ‌ల్లే అనారోగ్యం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాను.

స‌క్సెస్‌, ఫెయిల్యూర్ రెండూ చూశాడు.ష‌ణ్ను చాలా తెలివైన‌వాడు.

త‌ను ఎంతో బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తాడు.మా ఇష్ట‌ప్ర‌కారం పిల్ల‌లు విద్య పూర్తి చేసి వారికి న‌చ్చిన కెరీర్ ఎంచుకున్నారు.

ష‌ణ్ను చాలా ఇబ్బందులుపడి గొప్ప స్థాయికి ఎదిగాడు.స‌క్సెస్‌, ఫెయిల్యూర్ రెండూ చూశాడు.

త‌న‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదురైనా మాకు చెప్పేవాడు కాదు.మేము ఎక్క‌డ బాధ‌ప‌డతామో అని మా ముందు త‌ను ఇబ్బందులు చెప్పుకునేవాడు కాదు.

సొంతంగా ఎద‌గాల‌నుకున్నాడు.త‌న కాళ్ల‌పై త‌ను నిల‌బ‌డ్డాడు.

అని చెప్పుకొచ్చింది షణ్ముఖ్ జశ్వంత్ తల్లి..

తాజా వార్తలు