డైనమిక్ లుక్ లో చరణ్.. ‘RC15’ నుండి మరో లీక్.. అందుకు ఫ్యాన్స్ వెయిటింగ్!

ఈ మధ్య కాలంలో కొత్త సినిమాల నుండి భారీగా లీక్స్ జరుగుతున్నాయి.

స్టార్ హీరోలతో తీసే భారీ బడ్జెట్ సినిమాల నుండి మాత్రం వరుసగా లీక్స్ బయటకు వస్తూనే ఉన్నాయి.

దీంతో ఈ విషయం నిర్మాతలకు తలనొప్పిగా మారింది.మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కానీ ఈ లీక్స్ ను ఆపలేక పోతున్నారు.

ముఖ్యంగా మన టాలీవుడ్ లో రామ్ చరణ్ (Ram Charan), శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా నుండి మరింత లీక్స్ బయటకు వస్తున్నాయి.మన స్టార్ హీరోల్లో రామ్ చరణ్ RC15 కు లీకుల సెగ ఎక్కువుగా ఉంది.

ఈ సినిమా నుండి బాగా లీక్స్ బయటకు వస్తూనే ఉన్నాయి.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ (Director Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా RC15.

Advertisement

ఈ సినిమా ఇప్పటికే 70 శాతానికి పైగానే షూట్ పూర్తి చేసుకుంది.మిగతా పార్ట్ కూడా శరవేగంగా చేస్తున్నారు.

ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి భారీ హైప్ నెలకొంది.పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఎప్పుడు ఏదొక రూపంలో లీక్స్ వస్తూనే ఉన్నాయి.తాజాగా మరోసారి చరణ్ ఫోటో బయటకు వచ్చింది.

ఇందులో చరణ్ హెయిర్ స్టైల్, మెడలో ఒక తాడుతో డైనమిక్ లుక్ లో చరణ్ కనిపిస్తున్నాడు.మరి ఈ లుక్ చూసిన చరణ్ ఫ్యాన్స్ అంతా ఈ పుట్టిన రోజుకు అయినా లుక్ రివీల్ చేస్తారేమో అని ఎదురు చూస్తున్నారు.

మార్చి 27న చరణ్ పుట్టిన రోజు (Ram Charan Birthday) కానుకగా ఈ సినిమా నుండి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవుతుంది అని బజ్ వినిపిస్తుంది.ఇదే నిజమైతే ఇక మెగా ఫ్యాన్స్ కు పూనకాలే.ఇదిలా ఉండగా తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు తన బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

Advertisement

తాజా వార్తలు