శంకర్‌ మెడలు వంచిన లైకా ప్రొడక్షన్స్‌... దిగ్గజ దర్శకుడు కాంప్రమైజ్‌ కాక తప్పలేదు

భారీ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు శంకర్‌ ప్రస్తుతం భారతీయుడు 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.

కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్‌ వస్తున్న నేపథ్యంలో సినీ వర్గాల్లో కూడా ఆసక్తి ఉంది.శంకర్‌ ఏ సినిమాను అయినా వందల కోట్ల బడ్జెట్‌తో తీస్తున్నాడు.

ఈ సినిమాను మొదట 200 కోట్ల బడ్జెట్‌ అన్నాడు.అయితే షూటింగ్‌ ప్రారంభం అయ్యిందో లేదో అప్పుడే 50 కోట్లు ఖర్చు చేశాడు.

మరో 250 కోట్లు అవుతుందని చెప్పడంతో నిర్మాణ సంస్థ లైకా వారు ఆలోచనల్లో పడ్డారు.

Advertisement

లైకా వారి నిర్మాణంలో శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన 2.ఓ చిత్రం దాదాపుగా 100 కోట్ల నష్టాలను మిగిల్చింది.దాంతో భారతీయుడు 2ను మరీ ఓవర్‌ బడ్జెట్‌తో తీయవద్దని శంకర్‌తో లైకా వారు చెప్పారట.250 కోట్లకు మించి బడ్జెట్‌ ఖర్చు చేయను అంటూ ఒప్పందం ఇవ్వాలని, అగ్రిమెంట్‌ చేసుకుందామని సూచించారట.కాని అందుకు శంకర్‌ నో చెప్పాడట.

బడ్జెట్‌ విషయంలో ఎలా ఒప్పందం చేసుకుంటామని అన్నాడట.దాంతో లైకా వారు సినిమా నిర్మాణంను నిలిపేయాల్సిందిగా సూచించారు.

దాంతో భారతీయుడు 2 మూవీ ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి.

తనకు పరిచయం ఉన్న నిర్మాతలతో మాట్లాడి భారతీయుడు 2ను మళ్లీ మొదలు పెట్టాలని శంకర్‌ భావించాడు.కాని ఏ నిర్మాత కూడా భారతీయుడు 2కు 200 కోట్ల కంటే ఎక్కువ పెట్టలేమని చెప్పేశారు.దాంతో చేసేది లేక లైకా వారికి 250 కోట్ల బడ్జెట్‌తో భారతీయుడు 2ను పూర్తి చేస్తానంటూ శంకర్‌ అగ్రిమెంట్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

50లోనూ యంగ్ గా కనిపించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

మామూలుగా అయితే శంకర్‌ 350 కోట్ల వరకు భారతీయుడు 2 సినిమా బడ్జెట్‌ను తీసుకు వెళ్లేవాడు.కాని ఇప్పుడు అగ్రిమెంట్‌ ఇచ్చిన కారణంగా దాన్ని దాటక పోవచ్చు.

Advertisement

ఒకవేళ దాటితే అది శంకర్‌ ఖాతా నుండి ఖర్చు అవుతుందట.

తాజా వార్తలు