మహాశివరాత్రి రోజు శని త్రయోదశి రావాడం అదృష్టమా.. అరిష్టమా ..

మహా శివరాత్రి పండుగ రోజు శని త్రయోదశి చాలా అరుదుగా వస్తుంది.ఇలా రావడం అరిష్టమా, తొలి పూజ ఎవరికి చేయాలి.

శివరాదన చేయాలా, శనీశ్వరుడికి అభిషేకించాలా ఆలోచనలో భక్తులు ఉన్నారు.ఈ నెల 18 శనివారం రోజు మహాశివరాత్రి జరుపుకుంటారు.

అదే రోజు మరో అత్యంత అరుదైన సంఘటన కూడా జరగబోతోంది.మహాశివరాత్రి రోజు శని త్రయోదశి కూడా రాబోతోంది.

ఇదే ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది.ఇది అదృష్టమా,ఆరిష్టమా అసలు శివరాత్రి రోజు ప్రథమ పూజ ఎవరికీ చేయాలి అనే ధర్మసందేహం కోసం చాలామంది ప్రజలు సందేహంలో ఉన్నారు.

Advertisement

పరమాశివుడికి తొలి పూజ చేస్తే శనీశ్వరుడికి ఆగ్రహం వస్తుందా, శనీశ్వరుడికి ప్రథమ తాంబూలం ఇస్తే ముక్కోటి మూడో కన్ను తెరుస్తాడా, ఎవరికీ ముందు పూజ చేస్తే ఏం జరుగుతుందో అనే సందేహంలో భక్తులు ఉన్నారు.మహాశివరాత్రి రోజు శివునికే తొలి పూజ చేయాలని కొందరు అంటుంటే, శనీశ్వరునికే అగ్ర తంబరం ఇవ్వాలని మరికొందరు భక్తులు చెబుతున్నారు.

ఇలా పండితుల మధ్య భిన్నభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

పురాణాల ప్రకారం శని కరుణిస్తే అసలు కష్టాలు ఉండవు.శనికి కోపం వాస్తే ఈశ్వరుడి కైనా సరే శని దోషం తప్పదు.శని యముడికి సోదరుడు.

జ్యేష్టాదేవికి భర్త.శివుడికి పరమ భక్తుడు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
నోటి చుట్టూ ముడ‌త‌ల‌కు కార‌ణాలు, నివార‌ణ మార్గాలు మీకోసం!

అతని భక్తిని శివుడు పరీక్షించాలనుకున్నాడు.నేనంటే నీకు ప్రీతి కదా, నేను ఏ రూపంలో ఉన్న సరే నన్ను గుర్తుపట్టగలవా అని పరమశివుడు శనికి ఒక షరతును విధిస్తాడు.

Advertisement

శనిని పరీక్షించేందుకు శివుడు సూర్యోదయం సమయంలో బిల్వ వృక్షంగా మారుతాడు.

సాయంత్రానికి మళ్ళీ మామూలు రూపంలో ప్రత్యక్షమవుతాడు.బిల్వ వృక్షం నుంచి అసలు రూపంలోకి వచ్చిన శివుడికి శని కనిపిస్తాడు.శనీశ్వర నన్ను పట్టుకోలేకపోయావుగా అని ఈశ్వరుడు చెప్పినప్పుడు అదేంటి స్వామి నేను పట్టుకోవడం వల్లే కదా మీరు బిల్వ వృక్షం రూపం దాల్చాల్సి వచ్చింది అని జవాబు చెబుతాడు.

ఇలా ఈశ్వరుడు శని భక్తిని మెచ్చుకున్నాడు.బిల్వ దళాలతో శనీశ్వరుని పూజిస్తే శుభాలను అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం.

తాజా వార్తలు