కాంగ్రెస్ లో లుకలుకలు...భవిష్యత్ లో రేవంత్ ఒంటరి పోరాటం తప్పదా?

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ రకరకాల ఒడుదుడుకులను ఎదుర్కొంటోంది.

ఇప్పటికీ పీసీసీ చీఫ్ లను మార్చి ప్రయత్నించినా కాంగ్రెస్ నాయకులలో ఐక్యత మాత్రం కొరవడుతున్న పరిస్థితి ఉంది.

దీని కారణంగా పీసీసీ చీఫ్ గా నియమింపబడ్డవారు స్వేచ్చగా పార్టీ వృద్ధి కోసం పనిచేయలేనటువంటి పరిస్థితి ఉంది.ఐక్యంగా ఉండాలనే విషయంపై కాంగ్రెస్ హైకమాండ్ పలు మార్లు హెచ్చరించినా ఏ మాత్రం ఫలితం లేని పరిస్థితి ఉంది.

కాంగ్రెస్ లో ఉన్న విపరీతమైన ప్రజా స్వామ్యమే పార్టీలో లుకలుకలకు కారణమవుతుందని సీనియర్ రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయ పడుతున్నారు.తాజాగా జరిగిన కాంగ్రెస్ అంతర్గత సమావేశంలో జానారెడ్డి లాంటి నేతలు అసహనంతో ఊగిపోయిన పరిస్థితి ఉంది.

హుజూరాబాద్ లో ఓటమికి రేవంత్ ఒక్కడే బాధ్యత తీసుకోవడం కరెక్ట్ కాదని, పార్టీ నేతలందరు బాధ్యత తీసుకోవాలని జానారెడ్డి తెలిపినట్లు వార్తలు వినిపించాయి.  అలా చేస్తే పార్టీలో ఐక్యత నెలకొందనే భావన ప్రజల్లో కలుగుతుందని జానారెడ్డి తన స్వీయ అనుభవాన్ని జోడించి చెప్పిన పరిస్థితి ఉంది.

Advertisement
Shake-ups In Congress Should Rewanth Fight Alone In The Future, Congress Party,

అయితే రేవంత్ పీసీసీ చీఫ్ గా నియామకం అయిన తరువాత కాంగ్రెస్ మాత్రం కొంత పుంజుకున్న మాట వాస్తవం.

Shake-ups In Congress Should Rewanth Fight Alone In The Future, Congress Party,

అప్పటి వరకు నిరాశలో ఉన్న కార్యకర్తలకు రేవంత్ రూపంలో ఒక ఫైర్ బ్రాండ్ దొరకడంతో ఇక కార్యకర్తలందరు రేవంత్ వెంట కదిలిన పరిస్థితి ఉంది.ఇక దీంతో సీనియర్ నాయకులు రేవంత్ తనను తాను హైలెట్ చేసుకుంటూ సీనియర్ నేతల స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడని జగ్గారెడ్డి లాంటి నాయకులు బహిరంగంగా వ్యాఖ్యానించిన సందర్భం ఉంది.ఏది ఏమైనా రానున్న రోజుల్లో సీనియర్ లు ఒక్కటిగా కలిసి పనిచేయకుంటే రేవంత్ రెడ్డి ఇక ఒంటరి పోరాటం చేయక తప్పదు.

Advertisement

తాజా వార్తలు