బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ( Shahrukh Khan ) ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు.
అయితే ఎన్ని సినిమాలు చేస్తున్న గత దశాబ్దంగా సూపర్ హిట్ అనేది సాధించలేక పోయాడు.
కానీ షారుఖ్ నటించిన పఠాన్ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా అదిరిపోయే హిట్ అందించాడు.
మరి ఇంతటి విజయం సాధించిన తర్వాత ఈయన నెక్స్ట్ సినిమాపై ఆయన ఫ్యాన్స్ మరింత హోప్స్ పెట్టుకున్నారు.షారుఖ్ ఖాన్ కూడా వీరి అంచనాలను ఏమాత్రం తగ్గకుండా తన సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ నటిస్తున్న సినిమాల్లో జవాన్ ( Jawan Movie ) ఒకటి.ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ( Atlee Kumar ) డైరెక్ట్ చేస్తున్నాడు.
పఠాన్ తర్వాత ఈ సినిమా రిలీజ్ కానుండడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.ఈ సినిమా పఠాన్ తర్వాత కంటిన్యూస్ గా షూటింగ్ జరుపు కుంటూనే ఉంది.మరి తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయినట్టు తెలుస్తుంది.
అంతేకాదు ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేసేందుకు కూడా మిగతా పనులు కూడా శరవేగంగా ముగిస్తున్నారు.
ఇక షూట్ పూర్తి కావడంతో ఈ సినిమా ప్రమోషన్స్ పై మేకర్స్ ద్రుష్టి పెట్టబోతున్నారట.త్వరలోనే ఈ సినిమా అప్డేట్స్ ను ఒక్కోటిగా స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.ఇదిలా ఉండగా ఈ సినిమాలో నయనతార ( Nayanthara ) హీరోయిన్ గా నటిస్తుంది.
ఇది నయనతారకు హిందీ డెబ్యూ మూవీ కావడం విశేషం.అలాగే అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు.
జూన్ 2న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy