బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ( Shah Rukh Khan ) గురించి తెలియని సినీ లవర్ ఉండరు.
ఈయన ఇండియా వైడ్ మాత్రమే కాదు పాన్ వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందిన స్టార్ హీరోల్లో ఒకరు.
మరి అలాంటి కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఈ మధ్య వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ బాలీవుడ్ పరువు నిలుపుతున్నాడు.
షారుఖ్ ఖాన్ ( Shah Rukh Khan ) కు ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది అనే చెప్పాలి.ఎందుకంటే ఒకే ఏడాది రెండు సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.చాలా గ్యాప్ తర్వాత పఠాన్ సినిమాతో వచ్చిన షారుఖ్ కు అదిరిపోయే హిట్ దక్కింది.
ఇక ఈ మధ్యనే జవాన్ సినిమాతో వచ్చి మరో హిట్ అందుకున్నాడు.
వరుసగా రెండు వెయ్యి కోట్ల ప్రాజెక్టులను అందుకుని ఫుల్ జోష్ లో ఉన్నాడు.ఇదే జోష్ లో ఈ ఏడాది మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు షారుఖ్.మరి షారుఖ్ ఖాన్ తాజాగా నటించిన మూవీ డంకీ.
ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.బాలీవుడ్ బడా డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ( Rajkumar Hirani_తెరకెక్కిస్తున్న డంకీ సినిమా నుండి కొద్దిసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేసారు.
ముందు నుండి ప్రచార కార్యక్రమాలతో మంచి హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా ప్రామిసింగ్ గా ఉంది.షారుఖ్ మూడు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించి ఆకట్టుకున్నాడు.
మంచి ఫన్ టైమింగ్ తో పాటు డీసెంట్ యాక్షన్ తో హిరానీ మార్క్ ఈ ట్రైలర్ లో కనిపిస్తుంది.షారుఖ్ ఖాన్ తన గ్యాంగ్ తో లండన్ వెళ్లాలని అనుకోగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు అనే విషయాన్నీ మంచి ఎంటర్టైనింగ్ గా చూపించగా ట్రైలర్ తో మరింత ఆకట్టుకుంటుంది.
రాజ్ కుమార్ హిరానీ, గౌరీ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ కానుండగా ప్రభాస్ సలార్ తో పోటీ పడబోతోంది.చూడాలి ఎవరు విన్ అవుతారో.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy