'ఆదిపురుష్' మొదటి రోజు వసూళ్లను అందుకోలేకపోయిన షారుఖ్ ఖాన్ 'జవాన్'..ఇది ప్రభాస్ మాస్ అంటే!

ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన భారీ బడ్జెట్ చిత్రాలలో ఒకటి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్( Adipurush ) చిత్రం.

ఈ సినిమా ఫ్లాప్ అవ్వడమే కాకుండా, తీవ్రమైన వివాదాల్లోకి వెళ్ళింది.

రామాయణం ని అపహాస్యం చేస్తూ ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఓం రౌత్( Director Om Raut ) తీసాడని.కావాలనే ఉద్దేశపూర్వకంగా ఆయన మన చరిత్రని వక్రీకరించాడు అంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం చేసారు.

కానీ ప్రభాస్ లాంటి సూపర్ స్టార్, శ్రీ రాముడి పాత్ర పోషించడం, అందులోనూ భారీ బడ్జెట్ , 3D లో చూడొచ్చు అనే ఉద్దేశ్యం తో ఈ చిత్రానికి ఎగబడి మరీ వెళ్లారు ఆడియన్స్.దానికి తగ్గట్టుగానే మొదటి రోజు ఓపెనింగ్స్ దుమ్ము లేచిపోయాయి.

తెలుగు మరియు హింది భాషల్లో కలలో కూడా ఊహించని రేంజ్ ఓపెనింగ్స్ వచ్చింది, అందరూ ఒక్కసారి షాక్ అయ్యారు.

Advertisement

ఇప్పుడు లేటెస్ట్ గా షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన జవాన్( Jawan ) చిత్రం నిన్న తెలుగు , హిందీ మరియు తమిళం బాషలలో గ్రాండ్ గా విడుదలైంది.మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చాయి.ట్రేడ్ అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 120 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

అంటే ఇది ఆదిపురుష్ మొదటి రోజు వసూళ్ల కంటే తక్కువే వచ్చాయి అన్నమాట.ఆదిపురుష్ చిత్రానికి మొదటి రోజు తెలుగు, హిందీ ,తమిళం , మలయాళం మరియు కన్నడ భాషలకు కలిపి 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఒక ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు.షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కూడా ఆ వసూళ్లను అందుకోలేకపోయాడు అంటే ప్రభాస్ స్టార్ స్టేటస్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమా వరకు ప్రభాస్ స్టార్ స్టేటస్ కంటే ఎక్కువగా , శ్రీ రాముడి సెంటిమెంట్( Lord Sri Rama ) బాగా కలిసొచ్చింది.రామ నామాన్ని ఉత్తరాది ప్రజలు ఎంతలా పఠిస్తారో, ఆయనని ఏ రేంజ్ లో ఆరాధిస్తారో ప్రత్యేకించు చెప్ప్పనక్కర్లేదు.ఫ్లాప్ టాక్ తోనే ఆ రేంజ్ వసూళ్లు వస్తే, ఇక హిట్ టాక్ తో ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో అని అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

ఈ లెక్కలన్నీ సలార్( Salaar ) చిత్రం తో తేల్చేస్తామని, బాహుబలి 2 రికార్డ్స్ ని కొల్లగొడుతాము అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటి నుండే సవాళ్లు విసురుతున్నారు.అయితే సెప్టెంబర్ 28 వ తారీఖున విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కొన్ని అనుకొని కారణాల వల్ల వాయిదా వెయ్యాల్సి వచ్చింది.

Advertisement

కొత్త విడుదల తేదీ ఈ వీకెండ్ లో వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు