రామ్ చరణ్ పై కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరో.. నెట్టింట్లో ట్వీట్ వైరల్?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక హీరో మరొక హీరో గురించి ప్రస్తావిస్తూ వారిపై విమర్శలు గాని ప్రశంసలు చేయడం జరుగుతూ ఉంటుంది.

అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో అభిమానులు అడిగే ప్రశ్నల్లో భాగంగా కూడా మరొక హీరో గురించి వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు.

ఈ నేపథ్యంలోని తాజాగా ఒక బాలీవుడ్ హీరో టాలీవుడ్ హీరో పై తనకున్న అభిమానాన్ని తెలిపాడు.ఆ హీరో మరెవరో కాదు షారుఖ్ ఖాన్.

తాజాగా బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని తెలిపారు.షారుక్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం పఠాన్.

ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

Advertisement

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అభిమానులతో ట్విట్టర్ వేదికగా ముచ్చటించారు హీరో షారుఖ్ ఖాన్.ఈ సందర్భంగా అభిమానులు అడిగే ప్రశ్నలకు క్రేజీగా ఆన్సర్లు ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఒక అభిమాని ఒక ముక్కలో హీరో రామ్ చరణ్ గురించి చెప్పండి అని ప్రశ్నించగా.ఆ విషయంపై స్పందించిన షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ నాకు ఓల్డ్ ఫ్రెండ్.

అంతేకాకుండా మా పిల్లలకు రాంచరణ్ అంటే ఎంతో ఇష్టం అని తెలిపారు షారుక్ ఖాన్.ఇకపోతే షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా విషయానికి వస్తే.

ఈ సినిమా గత కొద్ది రోజులుగా విమర్శలకు గురవుతోంది.ఈ సినిమాలోని ఒక పాటలో దీపికా వేదుకొనే వేసుకున్న కాషాయపు రంగు దుస్తులపై పెద్ద ఎత్తున విమర్శలు ట్రోల్స్ వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే సినిమా విషయంలో బీజేపీ వర్సెస్ బాలీవుడ్ అన్న రేంజ్ లో వివాదాలు కొనసాగుతున్నాయి.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

కాగా ఈ విషయంలో ఎక్కువ శాతం మంది పటాన్ సినిమాకి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.ఈ విషయంపై రాజకీయ నాయకులతో పాటు సినీ ఇండస్ట్రీలోను పలువురు సెలబ్రిటీలు సైతం స్పందిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertisement