చౌటుప్పల్ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయండి

యాదాద్రి భువనగిరి జిల్లా: దినదినాభివృద్ధి చెందుతున్న చౌటుప్పల్ పట్టణంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని యువత డిమాండ్ చేస్తున్నారు.

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 30 వేలకు పైగా జనాభా ఉండగా అందులో 10 వేలకు పైగా యువత ఉంటారని,ఉరుకులు పరుగుల జీవితంతో హడావిడిగా ఉన్న యువత ఆరోగ్యం పైన సరిగ్గా దృష్టి పెట్టాలంటే వ్యాయామమే సరైన మార్గమని,కానీ,పట్టణంలో ఓపెన్ జిమ్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు.

మున్సిపల్ పరిధిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తే మానసికంగా,శారీరకంగా ఆరోగ్యంగా ఉండొచ్చని యువత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కొన్ని మారుమూల గ్రామాల్లోనే ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేశారని,కానీ,చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేయకపోవడం ఏమిటని అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని చౌటుప్పల్ పట్టణంలో ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Blackjack Variants & All Blacks Betting : A Practical Guide For NZ Punters
Advertisement

Latest Video Uploads News