అనాధ గా పెరిగిన సీరియల్ హీరోయిన్ మధు క్రిష్ణ కష్టాలు వింటే కన్నీళ్లు రాక తప్పవు..

పేరెంట్స్ సపోర్టు లేకుండా సొసైటీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు.అందులోనూ అమ్మాయి అయితే మరింత కష్టం.

అమ్మానాన్న లేకుండా.అమ్మమ్మ తాతల లాలన లేకపోతే మరింత ఇబ్బంది అవుతుంది.

సేమ్ ఇలాంటి ఇబ్బందులే అనుభవించింది టాలీవుడ్ బ్యూటీ మధు క్రిష్ణ.తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను వివరించింది.

నాన్నమ్మ వాళ్ల కంటే అమ్మమ్మ వాళ్లు తమ మనువళ్లు, మనువరాళ్లను బాగా చూసుకుంటారు.కానీ తన జీవితంలో రివర్స్ అయ్యిందని చెప్పింది మధు క్రిష్ణ.

Advertisement

అమ్మమ్మ వాళ్లు వదిలేసి వెళ్లిపోతే నాన్నమ్మ వాళ్లు ప్రేమగా చూసుకున్నారని చెప్పింది.వాళ్లు తుది శ్వాస విడిచే వరకు కంటికి రెప్పలా పెంచారని చెప్పింది.

వారి మూలంగానే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నట్లు చెప్పింది.తనకు చిన్నప్పటి నుంచే అమ్మానాన్న లేరని చెప్పింది.

వారి ప్రేమ కూడా తెలియదు.తనకు 11 ఏండ్ల వయసు ఉన్నప్పుడే రోడ్డు ప్రమాదంలో తండ్రి చనిపోయాడు.

అప్పుడు తన తల్లికి కేవలం 25 ఏండ్లు.ఆ వయసులో తనకూ ఏం తెలిసేది కాదు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

ఆ తర్వాత అమ్మమ్మ వాళ్లు అమ్మను తీసుకెళ్లారు.అమ్మాయిని 11 ఏండ్ల వయసులోనే సాధలేమని వదిలేసి వెళ్లిపోయారు.

Advertisement

నాన్నమ్మ, తాతయ్య వయసు మీద పడినా తనను భారంగా భావించలేదన్నారు.తనను ఎంతో ప్రేమగా పెంచారని చెప్పింది.

వాళ్లు ఎంతో కష్టపడి తనను సాకారని వెల్లడించింది.వాళ్లకు తినకపోయినా.

నాకు కడుపు నిండా పెట్టేవారిని చెప్పింది.

అటు పక్కనే ఉండే బామ్మకు నేనంటే చాలా ఇష్టం.మా ఇబ్బందులు చూసి బాధపడిందని చెప్పింది.వారి కుటుంబం బాగా ఉన్నత కుటుంబం కావడంతో తనను వాళ్లే చదివించారని చెప్పింది.ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చినట్లు చెప్పింది.2014లో భలె భలె మగాడివోయ్ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినట్లు వెల్లడించింది.ప్రస్తుతం తాను హ్యాపీగా ఉన్నట్లు చెప్పింది.

తాజా వార్తలు