మజిలీ' సినిమాకు సెన్సార్‌ బోర్డు వారి స్పందన ఏంటో తెలుసా?

నాగార్జున, సమంత జంటగా తెరకెక్కిన చిత్రం మజిలీ.శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ మరియు టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

భారీ అంచనాల నడుమ రూపొందిన మజిలీ చిత్రం అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.భారీ ఎత్తున అంచనాల నడుమ ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రంకు సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.

సినిమాకు సెన్సార్‌ బోర్డు వారు యూ/ఎ సర్టిఫికెట్‌ ఇవ్వడం జరిగింది.సినిమా చాలా కూల్‌గా, ఎమోషనల్‌ లవ్‌తో, మెచ్యూర్డ్‌ లవ్‌ సీన్స్‌తో సాగిందని, తప్పకుండా ఇది ఫ్యామిలీ మరియు యూత్‌ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులతో సెన్సార్‌ బోర్డు సభ్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది.

మొత్తానికి మజిలీ చిత్రం ఒక విభిన్నమైన ప్రేమ కథ చిత్రంగా నిలుస్తుందని బోర్డు వారు అన్నట్లుగా తెలుస్తోంది.

Advertisement
Sensor Board Response On Majli Movie-మజిలీ#8217; సినిమా�
Sensor Board Response On Majli Movie

అక్కినేని జంట నాగచైతన్య మరియు సమంత కలిసి నటించిన సినిమా అవ్వడం, అది కూడా పెళ్లి తర్వాత కలిసి మొదటి సారి నటించిన సినిమా అవ్వడంతో ఈ చిత్రంకు మంచి క్రేజ్‌ ఉంది.అందుకే విడుదలకు ముందే ఈ చిత్రం 30 కోట్లకు పైగా బిజినెస్‌ చేసి నిర్మాతలకు పది కోట్ల మేరకు లాభాలను తెచ్చి పెట్టింది.సినిమా విడుదలై ఏమాత్రం పాజిటివ్‌ టాక్‌ దక్కించుకున్నా మరో పది కోట్లు సనాయాసంగా రావడం ఖాయం.

భారీ ఎత్తున ఈ చిత్రంను విడుదల చేసి ఓపెనింగ్స్‌తోనే 10 కోట్లు బుట్టలో వేసుకోవాలనేది యూనిట్‌ సభ్యుల ప్లాన్‌గా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు