బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై సంచలన తీర్పు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్( BRS MLC Dande Vithal ) ఎన్నికపై తెలంగాణ హైకోర్టు( Telangana High Court ) సంచలన తీర్పును వెలువరించింది.

ఈ మేరకు ఎమ్మెల్సీగా దండె విఠల్ ఎన్నిక చెల్లదని న్యాయస్థానం ప్రకటించింది.

కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును వెల్లడించింది.అయితే ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2022 లో దండె విఠల్ ఎన్నికైన సంగతి తెలిసిందే.

ఫోర్జరీ సంతకాలతో తన పేరిట నామినేషన్ ఉపసంహరణకు ప్రయత్నించారని రాజేశ్వర్ రెడ్డి( Rajeshwar Reddy ) ఫిర్యాదు చేశారు.అనంతరం విఠల్ ఎన్నికను వాలస్ చేస్తూ ఆయన కోర్టులో పిటిషన్ వేశారు.

ఈ క్రమంలో దండె విఠల్ ఎమ్మెల్సీ ఎన్నికను హైకోర్టు రద్దు చేసింది.అదేవిధంగా దండె విఠల్ కు రూ.50 వేల జరిమానా విధించింది.కాగా దండె విఠల్ న్యాయవాది అభ్యర్థన మేరకు తెలంగాణ హైకోర్టు తీర్పును నాలుగు వారాలు సస్పెండ్ చేసింది.

Advertisement
ఆయన మరణ వార్త చదువుతూ ఏడ్చేసిన యాంకర్..

తాజా వార్తలు