జగన్ జైలుకి సంబంధించి ఉండవల్లి సంచలన కామెంట్స్..!!

ఇటీవల ఏపీ బిజెపికి చెందిన కొంతమంది కీలక నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ బెయిలుపై బయట ఉన్నారని, అది ఎప్పుడైనా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది అంటూ సంచలన కామెంట్ చేయటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే అంశానికి సంబంధించి మీడియా సమావేశం నిర్వహించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ మళ్లీ జైలుకు అనేదాని విషయంపై స్పందించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఉండవల్లి మాట్లాడుతూ.కేవలం కేంద్ర ప్రభుత్వం అదాని, అంబానీ వారికి ప్రభుత్వ సంస్థలను కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే .కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపణలు చేశారు.అసలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని అన్నారు.

Sensational Comments Made By Undavalli Arun Kumar Regarding Jagan Jail , Vishaka

ఈ విషయంపై పార్లమెంటులో పెద్ద ఎత్తున ప్రత్యేక చర్చ జరగాలని ఉండవల్లి కోరారు.ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ స్టేటస్ కాదని చెప్పి పాండిచ్చేరికి స్పెషల్ స్టేటస్ అనే హామీ బిజెపి ఇవ్వటం సరి కాదని అన్నారు.

అయినా గాని చంద్రబాబు, జగన్ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు భయపడుతున్నారు అని ప్రశ్నించారు.భారీ మెజార్టీతో ప్రజలు జగన్ లే గెలిపించటం జరిగిందని, జగన్ ని ఒకవేళ జైలులో పెట్టినా గాని అక్కడ నుంచి పరిపాలించే సత్తా అతనికి ఉందని పేర్కొన్నారు.

Advertisement

జగన్ జైలుకు వెళ్లడం కొత్తేమి కాదని పేర్కొన్నారు.గ్రామంలో కేంద్రం మాత్రం జగన్ ని అరెస్టు చేసే అంత సాహసం మాత్రం చేయదని తాను భావిస్తున్నట్లు ఉండవల్లి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు