రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ తర్వాత అనేకచోట్ల గొడవలు జరగటం తెలిసిందే.తమ పార్టీకి  ఓటు వేయలేదని కొన్ని పార్టీలకు చెందిన నాయకులు.

ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఇళ్లపై దాడులకు పాల్పడటం జరిగింది.ఈ క్రమంలో శుక్రవారం వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓటమి సరళని చూసి ప్రజా వ్యతిరేక ఓటు అనుకోవద్దని పేర్కొన్నారు.ఈ ఎన్నికలలో వైసీపీ( YCP ) విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నామని.

గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు సాధిస్తామని పేర్కొన్నారు.చంద్రబాబు( Chandrababu ) పూర్తిగా నెగిటివ్ క్యాంపెయిన్ చేశారని.

Advertisement

ఆయనపై ఆయనకే నమ్మకం లేదని వ్యాఖ్యానించారు.కుప్పంలో( Kuppam ) కూడా వైసీపీ గెలవబోతుందని పేర్కొన్నారు.

కుట్రపూరితంగానే కొందరు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించారని విమర్శించారు.జగన్ చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని చెప్పారు.తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి( Tadipatri MLA Peddareddy ) ఇంట్లో సీసీటీవీ లను పోలీసులు ధ్వంసం చేయటం ఏమిటని ప్రశ్నించారు.

పోలింగ్ రోజు టీడీపీ ( TDP ) అక్రమాలకు పాల్పడిందని.కౌంటింగ్ రోజున అక్రమాలు జరిగితే ఎదుర్కొంటామని అన్నారు.

ఈసీ వైఫల్యం వల్లే రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరిగాయని ఆరోపించారు.ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని చంద్రబాబు చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.పోలింగ్ శాతం పెరిగితే వైసీపీ ఓడిపోతుందని భ్రమలో టీడీపీ.

ఇలాంటి ఇళ్లలోనే ఆడ పిల్లలు జన్మిస్తారా..!

ఉందని.వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Advertisement

కచ్చితంగా ఎన్నికలలో తామే గెలుస్తున్నట్లు స్పష్టం చేశారు.

తాజా వార్తలు