కరోనా వల్ల ఆ నిర్మాత బాగానే లాభాలు గడిస్తున్నాడుగా...

ప్రస్తుతం సినిమా పరిశ్రమ ఏదైనా సరే అందులో డిజిటల్ మీడియా రాజ్యమేలుతోంది.

ఇందులోభాగంగా ఇప్పటికే ఈ డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఉన్నటువంటి నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి డిజిటల్ మీడియా అప్లికేషన్లు రారాజుగా కొనసాగుతున్నాయి.

అయితే ఇటీవల కాలంలో "ఆహా" అనే యాప్ కూడా బాగానే హల్ చల్ చేస్తోంది.అయితే టాలీవుడ్ లో సినీ నిర్మాతగా మంచి అనుభవం ఉన్నటువంటి అల్లు అరవింద్ ఆహా యాప్ ని ప్రవేశ పెట్టాడు.

అయితే ఈ యాప్ వచ్చిన మొదట్లో పెద్దగా వర్కౌట్ కాలేదు కానీ ప్రస్తుతం మాత్రం బాగానే వర్కవుట్ అవుతోంది.ప్రస్తుతం టాలీవుడ్ లో కరోనా వైరస్ వల్ల సినిమా థియేటర్లు కొంతకాలం పాటు మూసివేస్తున్నామని ఇప్పటికే థియేటర్ల నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు.

దీంతో ఈ అంశం డిజిటల్ మీడియా ప్లాట్ ఫారంకి బాగానే కలిసొచ్చింది.అయితే డిజిటల్ మీడియా యాప్ అయినటువంటి ఆహాకి కూడా ఈ మధ్య కాలంలో వినియోగదారులు పెరిగినట్లు తెలుస్తోంది.

Advertisement
Senior Producer Allu Aravind Enjoying Profits On Aha Movie App-కరోనా

అయితే ఇందులో సంవత్సరానికి గాను కేవలం 365 రూపాయలు, మూడు నెలలకి గాను 149 రూపాయలు చెల్లించి ఉచితంగా సినిమాలు చూడవచ్చు.దీంతో కొంతమంది సినిమా ప్రియులు ప్రస్తుతం ఉన్నటువంటి సినిమా టికెట్ల ధరలను దృష్టిలో ఉంచుకొని ఎలాగో థియేటర్ కి వెళ్తే 100 రూపాయల నుంచి 300 రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఈ డిజిటల్ మీడియా యాప్ లను సబ్ స్క్రైబ్ చేసుకుంటున్నారు.

Senior Producer Allu Aravind Enjoying Profits On Aha Movie App

దీంతో ఇటీవల కాలంలో దాదాపుగా అల్లు అరవింద్ ఈ యాప్ ద్వారా బాగానే లాభాలు గడిస్తున్న ట్లు సమాచారం.అయితే సినీ నిర్మాతలు మాత్రం ఒక పక్క కరోనా వైరస్ వల్ల తాము నిర్మించినటువంటి సినిమాలు విడుదల కాక బాధపడుతుంటే అల్లు అరవింద్ మాత్రం ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ ని బాగానే ఉపయోగించుకుని నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు