Actress Sukanya: 50 ఏళ్ళ వయసులో మరో పెళ్ళికి సిద్ధమైన టాలీవుడ్ నటి.. మండిపడుతున్న నెటిజన్స్?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి సుకన్య( Actress Sukanya ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సుకన్య ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

తమిళం కన్నడ తెలుగు మలయాళ భాషల్లో అనేక సినిమాలలో నటించి హీరోయిన్ గా భారీగా గుర్తింపు తెచ్చుకుంది సుకన్య.ముఖ్యంగా ఈమె నటించిన భారతీయుడు సినిమా( Bharateeyudu Movie ) ఈమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.

ఇందులో కమలహాసన్ భార్య పాత్రలో అద్భుతంగా నటించి పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంది సుకన్య.

కొద్దిరోజుల పాటు ఒక వెలుగు వెలిగిన ఈమె ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది.ఆ తర్వాత సాంబ, శ్రీ, మున్నా, అధినాయకుడు, శ్రీమంతుడు తదితర సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా( Character Artist ) మెప్పించింది.హీరో హీరోయిన్లకు తల్లి క్యారెక్టర్లలో నటిస్తూ రాణిస్తోంది సుకన్య.

Advertisement

ఇక ఈమె 2002లో శ్రీధరన్‌( Sridharan ) అనే వ్యక్తిని వివాహం చేసుకుని అమెరికా వెళ్లిపోయింది.అయితే కొన్ని కారణాలతో భర్త నుంచి విడిపోయింది.

విడాకులు తీసుకుని మళ్లీ వెంటనే ఇండియాకు వచ్చేసింది.ఆ తర్వాత మళ్లీ సినిమాలో బిజీగా మారిపోయింది.

కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో సుకన్యకు సంబంధించిన ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది.అదేమిటంటే సుకన్య వయస్సు ప్రస్తుతం 50 ఏళ్లు. త్వరలో ఆమె మళ్లీ పెళ్లి చేసుకోనుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

తాజాగా ఈ రూమర్లపై స్పందించింది అందాల తార.రెండో పెళ్లి( Second Marriage ) వార్తలపై తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చింది.నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

ఒకవేళ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు.అమ్మ అని పిలుస్తారా? లేదా అమ్మమ్మ అని పిలుస్తారా? అని తనదైన శైలిలో కౌంటర్లు వచ్చింది.దీంతో నటి సుకన్య రెండో పెళ్లి వార్తలు కేవలం పుకార్లేనని తేలిపోయింది.

Advertisement

అయితే ఆమె 50 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధపడుతుందంటూ వార్తలు వినిపించడంతో నేటిజన్స్ ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.కానీ ఆమె అవన్నీ కొట్టి పడేయడంతో అటువంటి వార్తలు సృష్టించే వారిపై మండిపడుతున్నారు నెటిజన్స్.

తాజా వార్తలు