ఆ ఒక్కరు తప్ప మిగతా కంటెస్టెంట్లు వేస్ట్.. 12 మంది తీసుకురావడమే బెటర్..?

బుద్ధిబలం, శారీరక బలం, ఎంతమందిలోనైనా ఇమడగలవాళ్లే ఎక్కడైనా సర్వైవ్ అవ్వగలరు.చివరికి బిగ్‌బాస్‌ హౌస్‌లోనైనా సరే.

ఈసారి సీజన్‌లో ఒక్కరిని కూడా ఊరికే కూర్చోబెట్టడం లేదు.అంటే హౌజులో ఉన్న ప్రతి కంటెస్టెంట్ ఆడాలి, ప్రేక్షకులను రంజింపచేయాలి, ఆట రక్తికట్టించాలి.

లేని పక్షంలో ఎవరైనా సరే చూడకుండా వారిని తరిమేసి, కొత్తవాళ్లను వైల్డ్ కార్డు ద్వారా తీసుకురావాలని చూస్తున్నాడు బిగ్ బాస్.ప్రస్తుతం హౌజ్‌లో 12 మంది ఉన్నారు.

వారందరినీ కూడా బయటికి పంపి 12 మందిని వైల్డ్ కార్డు ద్వారా తీసుకురావాలని బిగ్ బాస్ ప్రయత్నిస్తున్నాడు.అయితే కావాలనుకుంటే వారిని ఆపేసి వీళ్లే హౌస్‌లో ఉండడానికి ట్రై చేసుకోవచ్చు.

Advertisement

అదెలాగంటే బిగ్ బాస్( Big Boss ) కొన్ని గేమ్స్ పెడతాడు.ఒక్కొక్క గేమ్‌లో గెలుచుకుంటూ వెళ్తుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీల సంఖ్య కూడా ఒక్కొక్కటి తగ్గుతుంది.

ఏవో గేమ్స్ పెడుతున్నాడు.హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా కసిగా ఆడుతున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్లు.

మరోవైపు నలుగురు మిడ్ వీక్‌లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది.

వాళ్లు హరితేజ, అవినాష్, టేస్టీ తేజ, రోహిణి( Hariteja, Avinash, Tasty Teja, Rohini ).ఇంతకుముందు వీళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి ఆట ఆడిన వారే.అయితే వీళ్లెవరూ ఫినాలేలో పోటీ పడలేదు.

ఒక్క లీటర్ కెమికల్స్‌తో 500 లీటర్ల నకిలీ పాలు తయారీ.. వీడియో చూస్తే షాకే..
పుష్ప2 లో బన్నీ ధరించిన దుస్తుల వెనుక అసలు కథ ఇదే.. అక్కడే కొనుగోలు చేశారా?

కానీ వీరు హౌస్‌లో ఉంటే మొత్తం సందడి సందడిగా వాతావరణం తయారవుతుంది.డల్ గా ఉన్న షోను రక్తికట్టించగల స్పాంటేనిటీ, ఎనర్జీ వీరి సొంతం.

Advertisement

ఇప్పటికిప్పుడు వీరిని తీసుకొస్తే బిగ్‌బాస్ సీజన్ కొత్త జోష్ తో కళకళలాడిపోతుంది.టేస్టీ తేజ( Tasty Teja ) కామెడీ వరకు ఓకే మిగతా ముగ్గురు మాత్రం చాలా బాగా ఆట ఆడతారు.

ఈసారి బిగ్‌బాస్ కంటెస్టెంట్ల సెలక్షన్‌లో చాలా తప్పులు చేశాడు, మానసిక పరిస్థితి మంచిగా లేని వారిని కూడా తీసుకొచ్చాడు.ఈ నాలుగు వారాల్లో బేబక్క, అభయ్, సోనియా, శేఖర్ బాషా ఎలిమినేట్ అవ్వగా.ఉన్నవాళ్లలో ఒక్క నిఖిల్ మాత్రమే మెంటల్లీ స్టేబుల్ గా కనిపిస్తున్నాడు.

ఓ స్ట్రాటజీతో, చురుకుగా ఆట ఆడుతున్నాడు.ఆ ఒక్కడినీ ఉంచేసి మిగతా వాళ్లందరినీ ఇంటికి పంపించేయవచ్చు అని కూడా చాలామంది ప్రేక్షకులు వ్యాఖ్యలు చేస్తున్నారు.

మిగతా వారి స్థానంలో 12 మందిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకురావాలని కోరుతున్నారు.నిఖిల్ తర్వాత నబిల్, కిరాక్ సీత, ఆదిత్య ఓం కూడా మంచిగానే ఆడుతున్నారు.

మణికంఠ మాత్రం ఇరిటేట్ చేస్తున్నాడు.అయినా సరే వీరికంటే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా 12 మందిని పంపించడమే బెటర్ అని చాలామంది కోరుతుండటం విశేషం.

అయితే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా సోనియాని సడన్ గా తీసుకొస్తే మాత్రం విష్ణుప్రియ, సీత, నైనిక, యష్మి ముఖాలు మాడిపోతాయి.

తాజా వార్తలు