సిరి శ్రీహాన్ పై ఇన్వెస్ట్ చేస్తున్న శేఖర్ మాస్టర్.. అంత డబ్బులు వెనక్కొస్తాయా?

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ప్రస్తుతం శేఖర్ మాస్టర్ టాలీవుడ్ లో ఉన్న టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకరిగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఒకవైపు వెండితెరపై సినిమాలకు డాన్స్ మాస్టర్ గా కొరియోగ్రఫీ చేస్తూనే మరొకవైపు బుల్లితెర పై పలుషోలకు జడ్జిగా వ్యవహరించడంతో బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు శేఖర్ మాస్టర్.ఇక ఈ మధ్యకాలంలో శేఖర్ మాస్టర్ బుల్లితెరపై ఎంతగా కనిపించడం లేదు.

కానీ ఇదివరకు బుల్లితెరపై ఈవెంట్లలో పాల్గొంటూ డాన్సులు వేస్తూ తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను నవ్వించేవారు.ఒకవైపు కొరియోగ్రాఫర్ గా చేస్తూనే మరొకవైపు యూట్యూబ్లో శేఖర్ స్టూడియో అంటూ టెర్రస్ స్టోరీస్ అంటూ లఘు చిత్రాన్ని తీశాడు శేఖర్ మాస్టర్.

అవే కాకుండా యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు.అంతేకాకుండా తన కూతురు కొడుకుతో కలిసి ఫన్నీ వీడియోలు డాన్స్ వీడియోలు చేస్తూ యూట్యూబ్ ద్వారా కూడా బాగానే డబ్బు సంపాదిస్తున్నాడు శేఖర్ మాస్టర్.

Advertisement
Sekhar Master Produces Ott Web Series With Siri And Shrihan , Sekhar Master, Ott

ఇది ఇలా ఉంటే శేఖర్ మాస్టర్ ప్రస్తుతం పూర్తి నిర్మాతగా మారినట్టు తెలుస్తోంది.ఎందుకంటే బిగ్ బాస్ జంట సిరి శ్రీహాన్ లను పెట్టి ఒక కొత్త వెబ్ సిరీస్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ మేరకు శ్రీహన్ ఫుల్ ఖుషి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేశాడు.

Sekhar Master Produces Ott Web Series With Siri And Shrihan , Sekhar Master, Ott

అందులో శేఖర్ మాస్టర్ నిర్మించబోతున్న ఒక కొత్త వెబ్ సిరీస్ గురించి ప్రకటించాడు.దీని కోసమే ఇన్ని రోజులు ఎదురు చూసాను.ఇంకా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తాను.

ఇప్పుడు ఓటిటిలో వెబ్ సిరీస్ తో రాబోతున్నాను.సిరి తో కలిసి రాబోతున్నాను.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

ఆ వెబ్ సిరీస్ ను శేఖర్ మాస్టర్ నిర్మించగా సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు అంటూ శ్రీహాన్ చెప్పుకొచ్చాడు.కాగా ఇప్పటికే శ్రీహాన్ సిరి లు కలసి పలు వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే.

Advertisement

మరి ఈ జంటను నమ్ముకొని పెట్టుబడి పెట్టిన శేఖర్ మాస్టర్ కు లాభాలు వస్తాయా లేకపోతే నష్టాలు వస్తాయా అన్నది చూడాలి మరి.

తాజా వార్తలు