డ్యాన్స్ స్టెప్స్ విమర్శల గురించి స్పందించిన శేఖర్ మాస్టర్.. అలా చెప్పడంతో?

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్( Choreographer Sekhar Master ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

శేఖర్ మాస్టర్ బుల్లితెర అటు వెండితెర ప్రేక్షకులకు సుపరిచితమే.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ కూడా ఒకరు.ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు బెస్ట్ కొరియోగ్రఫీ అందించి కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అంతేకాకుండా శేఖర్ మాస్టర్ ఇప్పటివరకు ఎన్నో హిట్‌ సాంగ్స్‌కు అద్భుతమైన కొరియోగ్రఫీ అందించిన విషయం తెలిసిందే.కానీ ఈ మధ్య మాత్రం తన డిఫరెంట్‌ స్టెప్పుల వల్ల విమర్శలపాలవుతూ వస్తున్నాడు.

పుష్ప 2 సినిమాలో పీలింగ్స్‌ సాంగ్,( Peelings Song ) అలాగే బాలయ్య బాబు డాకు మహారాజ్‌ మూవీలో దబిడి దిబిడి సాంగ్,( Dabidi Dibidi ) నితిన్ రాబిన్‌ హుడ్‌ మూవీలో అదిదా సర్‌ప్రైజు( AdhiDha Surprisu ) పాటలు ఆన్‌లైన్‌ లో విపరీతమైన ట్రోలింగ్‌ కు గురైన విషయం తెలిసిందే.ఈ సాంగ్స్ పై నేటిజన్స్ భారీగా ట్రోల్స్ చేశారు.అలాగే శేఖర్ మాస్టర్ పై కూడా మండిపడుతూ ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

స్టెప్పులు శృతిమించాయి అంటూ పలువురు మండిపడుతున్నారు.రాను రాను శేఖర్ మాస్టర్ స్టెప్పులు చాలా బోల్డ్ గా ఉంటున్నాయి.

ఒక అమ్మాయితో వేయించాల్సిన స్టెప్పులేనా అవి అంటూ మండిపడుతున్నారు.అయితే ఇప్పటివరకు ఈ ట్రోల్స్ పై స్పందించని శేఖర్ మాస్టర్ మొదటిసారి ఈ ట్రోల్స్ పై స్పందించారు.

ఒక షోలో భాగంగా శేఖర్‌ మాస్టర్‌ మాట్లాడుతూ.ఏ పాటను ఎలా చేయాలో అలాగే చేస్తాము.అన్ని సాంగ్స్‌ ఒకేలా చేయము.

మాస్‌ సాంగ్‌ను ఒకలా, డ్యుయెట్‌ను మరోలా, ఇంకో సాంగ్‌ ఉంటే ఇంకోలా అలా ఒక్కో సాంగ్ ఒక్కో రకంగా చేస్తాము.మీరు బాగోలేదని రాసేయడానికి, చెప్పడానికి ఈజీగా ఉంటుంది.

లైంగిక శ‌క్తిని దెబ్బ‌తీసే ఈ ఆహారాల‌తో జ‌ర జాగ్ర‌త్త‌!

కానీ నాకు, నా వెనకాల ఉన్న టీమ్‌ కు ఎంతో కష్టమని చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఇది చూసిన అభిమానులు మీరు బాధపడకండి మాస్టర్‌ మేమెప్పుడూ మీకు తోడుగా ఉంటాం అని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

కొందరు మాత్రం తప్పు పట్టడం లేదు కానీ సాంగ్స్ లో స్టెప్స్ బోల్డ్ ఉన్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు