VIDEO: సీతక్కతో రాహుల్ గాంధీ ట్రెడిషనల్ డ్యాన్స్.. స్టెప్పులు అదిరిపోయాయిగా!

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని ‘భారత్ జోడో యాత్ర’ విజయవంతంగా కొనసాగుతోంది.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రవేశించిన ఈ యాత్ర త్వరలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాన్ని సమీపిస్తోంది.

ఈ రోజు ఉదయం 6 గంటలకు జయప్రకాశ్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాల నుంచి ఈ యాత్ర పారంభమైంది.అప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి రాహుల్ గాంధీ యాత్రను స్టార్ట్ చేశారు.

యాత్ర కొనసాగుతుండగా ధర్మపూర్ వద్ద ఆగి ఉన్న బస్సులో నుంచి ప్రయాణికులు రాహుల్.రాహుల్.

అంటూ నినాదాలు చేశారు.దీంతో రాహుల్ వారి దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు.

Advertisement
Seethakka Danced With Rahul Gandhi In Bharat Jodo Yatra-VIDEO: సీతక్�

దారి పొడవునా తరలివచ్చిన అభిమానులను చూసి రాహుల్ గాంధీ అభివాదం చేస్తూ యాత్ర కొనసాగించారు.కాగా, ప్రముఖ సినీ నటి పూనమ్ కపూర్, ఇతర నేతలతో కలిసి రాహుల్ గాంధీ కేంద్రానికి వినతి పత్రం అందజేశారు.

చేనేత రంగంపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం కంటే ఎక్కువగా జీఎస్టీ విధించింది.ఈ క్రమంలో జీఎస్టీని ఎత్తివేయాలని, చేనేత ముడి సరుకులపై పన్నులు తొలగించాలని వినతి పత్రం సమర్పించారు.

అయితే పూనమ్ కపూర్ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు.ఈ మేరకు జిల్లా కేంద్రంలోని అవంతి హోటల్‌లో రాహుల్ గాంధీ టిఫిన్ చేశారు.

Seethakka Danced With Rahul Gandhi In Bharat Jodo Yatra

అనంతరం భారత్ జోడో యాత్రను తిరిగి ప్రారంభించారు.ఎల్పీ నేత భట్టి విక్రమార్క, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి రాహుల్ గాంధీ డ్యాన్స్ చేశారు.ఆదివాసి కళాకారులతో కలిసి నృత్యం చేశారు.

Ayodhya : అయోధ్యకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. ముందు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి..

ఈ నృత్యంలో పాల్గొన్న రాహుల్ గాంధీ మరింత ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.సీతక్కతో కలిసి రాహుల్ గాంధీ స్టెప్పులేశారు.

Advertisement

అనంతరం రాహుల్ గాంధీని కలిసేందుకు ఆయా సంఘాల నాయకులు భారీగా తరలి వచ్చారు.అయితే 12 కిలో మీటర్ల యాత్ర పూర్తయిన తర్వాత ఎస్పీఎస్ ఆస్పత్రి సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్‌లో సేద తీరారు.

తాజా వార్తలు