కలలో ఇవి కనిపిస్తున్నాయా..? అయితే త్వరలోనే మీరూ..!

రాత్రి సమయంలో నిద్ర పోయేటప్పుడు ప్రతి ఒక్కరికి కలలు ( Dreams ) రావడం చాలా సహజం.

అయితే ఆ కలలో కొన్ని మంచివిగా వస్తే మరికొన్ని చెడ్డవిగా వస్తాయి.

కొంతమంది వీటిని కేవలం భ్రమలుగా కొట్టి పారేస్తారు.అయితే మరికొందరు దీనిని చాలా సీరియస్ గా తీసుకుంటారు.

ఇక తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు.అందులోనూ తెల్లవారుజామున వచ్చే కళ్ళల్లో కొన్ని వస్తువులు కనిపిస్తే మనకి డబ్బులు ( Money ) చేతికి అందుతాయని పండితులు కూడా చెబుతున్నారు.

అయితే ఈ కలల వెనక ముఖ్యమైన కారణాలు ఉంటాయి.

Advertisement

అలాగే రహస్యాలు కూడా ఉంటాయి.అలాగే వస్తువులు, బంధువులు, జంతువులు ఇలా కలలో ఏవేవో కనిపిస్తూ ఉంటాయి.ప్రత్యేకంగా ఒక వ్యక్తి, ఒక వస్తువు కలలో కనిపిస్తే దాని వెనుక ఎన్నో సంకేతాలు ఉన్నాయి.

కలలో కనిపించేవన్నీ కూడా నిజం కావని భ్రమ మాత్రమే అని మన మెదడు ఊహిస్తోంది.అది కూడా నిజమే కానీ మనకు కలలు వస్తున్నాయి.

అంటే భవిష్యత్తులో జరగబోయే వాటికి ఆనవాళ్ళని కొన్ని అధ్యాయనాలు చెబుతున్నాయి.ఇక కొన్ని రకాలుగా కలలు కంటే తొందరలోనే ధనవంతులవుతారని భవిష్య పురాణం( Bhavishya Puranam ) చెబుతోంది.

అయితే ధనవంతుల్ని చేసే ఆ కలల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భారతీయుల పొదుపు మంత్రం – ప్రపంచానికే మార్గదర్శకం
Soaked Almonds : నానబెట్టిన బాదం తింటే ఆరోగ్యానికి ఇన్ని లాభాలు ఉన్నాయా..

నిద్రపోయే సమయంలో కలలో ఉదయిస్తున్న సూర్యుడు గాని పున్నమి చంద్రుడు కానీ కనిపిస్తే మీకు త్వరలోనే డబ్బులు చేతికి అందుతాయని అర్థం.అంతేకాకుండా తెల్లవారుజామున వచ్చి కలలో మనుషుల మలం అంటే లెట్రిన్ కనిపిస్తే మీకు అదే రోజు లేదా మరుసటి రోజున డబ్బులు కచ్చితంగా చేతికి అందుతాయని వేద పండితులు చెబుతున్నారు.ఇక కలలో జుట్టు రాలుతున్నట్టు, ఆవుపాలు ఇస్తున్నట్టు కనిపిస్తే కూడా శుభంగా పేర్కొనబడింది.

Advertisement

ఇక కలలో బంగారం ధరించినట్టు, పాయసం తింటున్నట్లుగా కానీ వండుతున్నట్లుగా గాని, అలాగే చక్కటి అద్దాలు కలలో కనిపిస్తే వారికి త్వరలోనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భవిష్య పురాణం చెబుతోంది.

తాజా వార్తలు