వైరులో ఇరుక్కుపోయిన చిరుతపులి.. ఎలా విడిపించారో చూడండి...

బాధాకరమైన పరిస్థితి నుంచి చిరుత పులిని రక్షించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్‌గా మారింది.

చిరుతపులి వైర్‌లో ఇరుక్కుపోయి, విడిపించుకోలేక చెట్టుకు వేలాడుతూ చాలా ఇబ్బంది పడింది.

జంతు సంరక్షణ, పునరావాస కేంద్రమైన RESQ నుంచి రక్షకుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతను ఎలా రక్షించిందనేది కూడా వీడియో చూపిస్తుంది.

రెస్క్యూయర్స్ మొదట చిరుతపులికి మత్తుమందు ఇచ్చేందుకు బ్లోపైప్‌ని ఉపయోగించారు.అది స్పృహ కోల్పోయే వరకు వేచి ఉన్నారు.అనంతరం చిరుతపులి( Leopard )కి చిక్కిన వైరు కత్తిరించి చెట్టుపై నుంచి దించారు.

చిరుతపులిని తమ వ్యాన్‌లోకి తీసుకెళ్లి గాయాలకు చికిత్స చేశారు.పులి పాదాలపై వాపు, చిన్న గాయాలు ఉన్నాయి, ఇది రెండు రోజుల్లో నయమైంది.

Advertisement

చిరుత పులి కోలుకున్న తర్వాత, రెస్క్యూయర్స్ దానిని గుర్తించిన ప్రదేశానికి సమీపంలోని సురక్షిత నివాస స్థలంలో విడిచిపెట్టారు.ఈ వీడియోను RESQ వ్యవస్థాపకురాలు నేహా పంచమియా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన X లో షేర్ చేశారు.

స్థానిక కోళ్ల ఫారమ్ సమీపంలో చిరుతపులి కనిపించిందని, ఈ ఘటనపై నాసిక్( Nashik ) అటవీ శాఖ తమకు సమాచారం అందించిందని ఆమె వివరించారు.ఇందుకు సహకరించిన అటవీశాఖ, స్థానికులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వీడియోకి ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో వేల కొద్ది వ్యూస్ లైకులతో వైరల్ అయింది.చాలా మంది నెటిజన్లు దానిని కాపాడినందుకుగాను రెస్క్యూ టీమ్‌( Rescue team )కు కృతజ్ఞతలు తెలిపారు.చిరుతపులి పరిస్థితి గురించి కూడా ప్రశ్నలు అడిగారు.

కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చిన నేహా చిరుత పులిని ప్రశాంతంగా ఉంచేందుకు మత్తులో ఉండగానే ముఖం కప్పి ఉంచామని తెలిపారు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు