కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు భద్రత పెంపు

త్వరలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) రానున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది.

ఈ మేరకు రాజీవ్ కుమార్ కు ‘జడ్’ ప్లస్ సెక్యూరిటీ( Z Plus Security )ని కేటాయించింది.ఎన్నికల నేపథ్యంలో సీఈసీ రాజీవ్ కుమార్( Rajiv Kumar ) కు ముప్పు పొంచి ఉందంటూ భద్రతా సంస్థల నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

కాగా ‘జడ్’ కేటగిరి భద్రత కింద సెంట్రల్ రిజర్స్ పోలీస్ ఫోర్స్ కు చెందిన సుమారు 40 నుంచి 45 మంది సిబ్బంది విధుల్లో ఉంటారు.అయితే ఈ నెల 19వ తేదీతో మొదలు కానున్న ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనున్న సంగతి తెలిసిందే.

Advertisement
నగ్నంగా పూజ చేస్తే లక్ష్మీదేవి వరిస్తుంది... విద్యార్థినిని మభ్యపెట్టిన కేటుగాళ్లు?

తాజా వార్తలు