అంగరంగవైభవంగా సికింద్రాబాద్ స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ పునఃప్రారంభం..

సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ పునఃప్రారంభం అంగరంగవైభవంగా జరిగింది.

కంచికామకోటి 70వ పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి చేతులమీదుగా స్వర్ణబంధన మహాకుంభాభిషేకం, విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమాలు 200మంది వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య అత్యంత భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగాయి.

ఉదయం నుండే భక్తుల తాకిడితో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి.పూజ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర గవర్నర్ డా.తమిళ సై సౌందర రాజన్, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరై ప్రత్యేక దర్శనం చేసుకొని పీఠాధిపతి ఆశీర్వాదాలు పొందారు.ఈ సందర్భంగా గవర్నర్ తమిళ సై మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో తెలంగాణతోపాటు దేశంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.

Secunderabad Skandagiri Subramanya Swamy Temple Inaugurated Grandly Details, Sec

కరోన మహమ్మారి నుండి యావత్ మానవాళి బయటపడాలని దేవుళ్లందరిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇక్కడ ఇంతమంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం రావడం తనకు ఎంతో సంతోషం కలుగచేసిందని వెల్లడించారు.

శ్రావణ భార్గవి - హేమచంద్ర లవ్ స్టోరీ గురించి తెలుసా.. ఆ సినిమా టైం లోనే?
Advertisement

తాజా వార్తలు