ఏక పీఠంపై దర్శనమిచ్చే పార్వతీ పరమేశ్వరుల ఆలయం ఎక్కడుందో తెలుసా?

మన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు మనకు దర్శనమిస్తాయి.ఈ విధమైనటువంటి ఆలయాలలో వింతలు, రహస్యాలు దాగి ఉంటాయి.

ఇలాంటి ఎంతో విశిష్టత కలిగిన ఆలయాలలో ‘జలధీశ్వరస్వామి క్షేత్రం’ ఒకటిగా కనిపిస్తుంది. ఈ ఆలయానికి సుమారు 2 వేల సంవత్సరాల చరిత్ర ఉందని శాసనాలు చెబుతున్నాయి.

ఎంతో ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం కృష్ణా జిల్లా ‘ఘంటసాల’లో దర్శనమిస్తుంది.సిద్ధార్థుడు తనకెంతో ఇష్టమైన ‘ఘంటక’ మనే అశ్వం చనిపోగా, దాని పేరున ఇక్కడ ఒక స్థూపాన్ని ప్రతిష్టించగా రాను రాను ఘంటసాలగా మారింది.

ఈ ఆలయంలో ఉన్న జలనిధిని ఈశ్వరుడిగా భావించి జలధీశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు.పాల రాయితో లింగాన్ని రూపొందించడం వల్ల ఈ లింగాన్ని శ్వేత లింగం అని కూడా పిలుస్తుంటారు.

Advertisement
Facts Behind Jaladheeshwara Swamy Temple, Gantasala, Lard Shiva, Pooja,jaladhees

సాధారణంగా మనం ఏదైనా శివాలయాన్ని దర్శించినప్పుడు గర్భగుడిలో పీఠంపై కేవలం మనకు శివలింగం మాత్రమే దర్శనం కల్పిస్తుంది.శివాలయం గర్భగుడి పక్కన అమ్మవారు కొలువై ఉండి అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తుంటారు.

ఈ జలధీశ్వరాలయంలో అన్ని ఆలయాలకు భిన్నంగా ఒకే పీఠంపై శివలింగం, అమ్మవారు కొలువై ఉండి దర్శనం కల్పిస్తున్నారు.

Facts Behind Jaladheeshwara Swamy Temple, Gantasala, Lard Shiva, Pooja,jaladhees

ఈ విధంగా ఆది దంపతులిద్దరూ ఒకే పీఠంపై దర్శన భాగ్యం కల్పించడం వల్ల దీనిని అర్థనారీశ్వర పీఠమని పేర్కొంటారు.ఆది దంపతుల ఆజ్ఞ మేరకే అగస్త్యమహర్షి ఇక్కడ స్వామి వారిని ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతున్నాయి.దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించడం వల్ల అష్టాదశ శక్తిపీఠాలను, జ్యోతిర్లింగాలను దర్శించినంత పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు.

ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసిన నీటిని సర్వరోగ నివారిణిగా భక్తులు భావిస్తారు.పండుగల వంటి ప్రత్యేక దినాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని దర్శించడం కోసం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు