తాజాగా శాస్త్రవేత్తలు రెండు వైపులా సూర్యుని శక్తి నుంచి విద్యుత్‌ను తయారు చేయగల ప్రత్యేక సోలార్ ప్యానెల్‌ను( Solar Panel ) తయారు చేశారు.
సాధారణంగా, సోలార్ ప్యానెల్స్ సూర్యుడి నుంచి శక్తిని పొందడానికి ముందు లేదా పైవైపు భాగాన్ని మాత్రమే ఉపయోగిస్తాయి, అయితే ఈ కొత్తది వెనుక వైపు భాగాన్ని కూడా ఉపయోగిస్తూ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది! ఈ ప్రత్యేక డబుల్-సైడెడ్ సోలార్ ప్యానెల్ "పెరోవ్‌స్కైట్" (Perovskite) పదార్థాన్ని ఉపయోగిస్తుంది, ఇది సూర్యుడి నుంచి శక్తిని పొందడంలో గొప్పగా పనిచేస్తుంది.
ఈ కొత్త ప్యానెల్ సాధారణ సోలార్ ప్యానెల్‌ల కంటే ఎక్కువ విద్యుత్‌ను తయారు చేయగలదు.ఎందుకంటే ఇది దాని వెనుక వైపు తిరిగి బౌన్స్ అయ్యే సూర్యకాంతిని ఉపయోగించగలదు.
సాధారణ సోలార్ ప్యానెల్‌లు 100% సూర్యకాంతిలో 26% సూర్యకాంతిని విద్యుత్‌గా మార్చగలవు.కానీ ఈ కొత్త డబుల్-సైడెడ్ సోలార్ ప్యానల్ ముందు వైపు 23 % సూర్యరశ్మిని, వెనుక వైపు 91-93 % సూర్యరశ్మిని మార్చగలదు.అలా ఇది చాలా విద్యుత్‌ను ( Electricity ) జనరేట్ చేయగలదు.
అయితే డైరెక్ట్ సన్‌లైట్ కంటే బౌన్స్ అయ్యే సన్‌లైట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్యానల్ పవర్ జనరేషన్ మరీ అధికంగా ఏమీ ఉండదు.కాకపోతే సాధారణ వాటితో పోలిస్తే 20% ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.
పెరోవ్‌స్కైట్ మెటీరియల్ సౌర ఫలకాలను మరింత మెరుగ్గా, మరింత శక్తివంతమైనదిగా చేయడంలో సహాయపడుతోంది.పెరోవ్‌స్కైట్‌తో ఉన్న కొన్ని ఇతర సోలార్ ప్యానెల్‌లు అంతరిక్షంలో పాడైపోతే తమను తాము బాగు కూడా చేసుకోవచ్చు.మొత్తం మీద, ఈ కొత్త సోలార్ ప్యానెల్‌లు మనకు మరింత విద్యుత్‌ను అందించగలవు.
కాకపోతే కొత్త సౌర ఫలకాలను తయారు చేయడానికి కొంచెం ఎక్కువ ఖర్చవుతుంది, కానీ అవి ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి, అవి దీర్ఘకాలంలో మంచి ఎంపిక కావచ్చు.జౌల్ అనే ప్రత్యేక సైన్స్ జర్నల్‌లో శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కరణ గురించి రాశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy