ఆ సూపర్ ఎర్త్‌ విశేషాలు కనుగొన్న సైంటిస్టులు.. ఇక్కడ బంగారమే కరిగిపోతుందట!

విశ్వం ఒక విస్తారమైన, ఆసక్తికరమైన, భయంకరమైన ప్రదేశం.ఈ విశ్వంలో మానవులకి తెలియని ఎన్నో రహస్యాలు దాగున్నాయి.

ఖగోళ రహస్యాలను బయట పెట్టేందుకు అన్వేషణ ప్రారంభించి ఒక శతాబ్దం కూడా గడిచిపోలేదు.కాగా ఇప్పటికే గెలాక్సీలో ఆల్రెడీ మనకి తెలిసిన గ్రహాల వంటి అనేక గ్రహాలు బయటపడ్డాయి.

వీటిలో GJ 1252 b అని పిలిచే ఒక గ్రహం ఉంది.ఇది అచ్చం భూమి లాగానే కనిపిస్తుంది.

కాకపోతే ఈ సూపర్-ఎర్త్ గ్రహానికి బంగారాన్ని కరిగించేంత అధిక ఉపరితల ఉష్ణోగ్రత ఉంటుంది.తాజాగా ఖగోళ శాస్త్రవేత్తలు భూమి-పరిమాణ రాతి ఎక్సోప్లానెట్ GJ 1252 b చాలా వేడిగా ఉందని, దానికి వాతావరణం ఉండకపోవచ్చని తెలిపారు.

Advertisement
Scientists Discovered New Planet Gj 1252 B With High Range Of Temperatures Detai

ద్వితీయ గ్రహణంలోకి ప్రవేశించినప్పుడు సూపర్-ఎర్త్ ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్‌ను కొలవడానికి ఖగోళ శాస్త్రవేత్తల బృందం ఇప్పుడు రిటైర్డ్ అయిన స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్‌ను ఉపయోగించింది.ఒక గ్రహం దాని నక్షత్రం వెనుకకు వెళ్ళినప్పుడు ద్వితీయ గ్రహణం సంభవిస్తుంది.

నాసా ప్రకారం, GJ 1252 b గ్రహం పగటి ఉష్ణోగ్రతలు 1,228 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్నాయని బృందం కనుగొంది.

Scientists Discovered New Planet Gj 1252 B With High Range Of Temperatures Detai

ఈ ఉష్ణోగ్రతలు బంగారం, వెండి, రాగి గ్రహం ఉపరితలంపై కరిగిపోయేంత వేడిగా ఉంటాయి.ఇక ఈ ఉష్ణోగ్రతలలో మనిషి అడుగుపెడితే క్షణాల్లోనే మసి అయిపోతారు.GJ 1252 b అనేది 2020లో కనుగొనబడిన రాతి, భూసంబంధమైన ఎక్సోప్లానెట్.ఇది భూమి కంటే పెద్దది, అలానే భూ గ్రహం కంటే 1.18 రెట్లు పెద్ద వ్యాసార్థంతో ఉంటుంది.ఈ మండుతున్న ఎక్సోప్లానెట్ భూమికి 65 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.

బిజీ రోడ్డుపై రాంగ్ రూట్‌లో పిల్లాడు బైక్ రైడింగ్.. తర్వాతేం జరిగిందో మీరే చూడండి!
Advertisement

తాజా వార్తలు