భూమికి సమీపంగా భూమిలాంటి మరో గ్రహమా?

భూమికి సమీపంగా భూమిలాంటి మరో గ్రహమా? ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవడానికి ఏముంది? అనాదిగా మానవుడు భూమికి ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తూనే వున్నాడు.

ఆ దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుగుపుతూనే వున్నాడు.

ఈ క్రమంలోనే సౌరవ్యవస్థకు వెలుపల భూమిలాంటి గ్రహాలు ఏవైనా ఉన్నాయా? అనే విషయంపైనా కొన్ని శతాబ్దాలుగా అణ్వేషన కొనసాగుతూనే వుంది.అవును, ఎక్లోప్లానెట్ కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు నేటికీ.

అయితే ఈ అన్వేషణలో ఇప్పటి వరకు భూమితో పోలికలు ఉన్న గ్రహాలను పదుల సంఖ్యలో కనుక్కున్నప్పటికీ పూర్తిగా అవి భూమి తరహా వాతావరణాన్ని కలిగి ఉండడం లేదు.అంటే మనుషులకు బతకడానికి అక్కడ ఆస్కారం లేదన్నమాట.ఇదిలా ఉంటే తాజాగా భూమికి అత్యంత సమీపంలో అంటే కేవలం 31 కాంతి సంవత్సరాల దూరంలో భూమి లాంటి గ్రహాన్ని కనుక్కున్నారు శాస్త్రవేత్తలు.

వోల్ఫ్ 1069బిగా పిలిచే ఈ గ్రహం తన మాతృ నక్షత్రం చుట్టూ తిరుగుతోందట.‘కాంతి సంవత్సరం’ గురించి అందరూ చదివే వుంటారు.కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ఒక సంవత్సరంలో ఎంతదూరం ప్రయాణిస్తుందో దానిని ‘కాంతి సంవత్సరం’ అని అంటారు.

Advertisement

అయితే దాదాపుగా భూమి ద్రవ్యరాశిని కలిగిన ఈ గ్రహం, కేవలం 15.6 రోజుల్లోనే నక్షత్రం చుట్టూ తిరుగుతోందని సమాచారం.భూమి, సూర్యుడి మధ్య దూరంతో పోలిస్తే కేవలం 15వ వంతు దూరంలోనే ఉంది.

ఇకపోతే శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.భూమి, సూర్యుడి నుంచి పొందే కాంతిలో కేవలం 65 శాతం పొందుతోందని.

వోల్ఫ్ 1069 నక్షత్రం తక్కువ రేడియేషన్ విడుదల చేస్తోందని దీంతో నారింజ కలర్ లో కనిపిస్తోందని చెబుతున్నారు.వోల్ఫ్ 1069 బీ, తక్కువ శక్తి కలిగిన మరగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతుండటం దానికి దగ్గరగా ఉన్నప్పటికీ.

హాబిటేబుల్ జోన్ లోనే ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంటున్నారు.

నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
Advertisement

తాజా వార్తలు