మహిళలు ప్రతిరోజూ బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?

హిందూసంప్రదాయం ప్రకారం ప్రతీ ఒక్కరు నుదుటన బొట్టు పెట్టుకోవాలి.ఆడ, మగ తేడా లేకుండా కుంకమ ధరించాలి.

కానీ పురుషులు ప్రతీ రోజు బొట్టు పెట్టుకోకపోయినా.మహిళలు పెట్టుకుంటారు.

ఒకరు నామం, మరొకరు విభూతి రేఖలు, మరొకరు కుంకుమ, గంధం ఇలా రకరకాలుగా నుదుట బొట్టు పెట్టుకుంటారు.అయితే దీని వెనుక పలు రహస్యాలు దాగి ఉన్నాయని పెద్దలు చెప్తారు.

 నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకుంటే దానిపై సూర్యకాంతి ప్రసరించి శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానము విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని వెలువరిస్తుంది.

Advertisement
SCIENTIFIC REASON BEHIND EVERY HINDU APPLYING KUNKUM ON FOREHEAD, Bottu , Tradit

అందువల్లనే విచారంగా ఉన్నప్పుడు తలనొప్పి వస్తుంది.తిలకము లేక బొట్టు మన నుదిటిన చల్లబరచి వేడి నుంచి రక్షణ ఇస్తుంది.

శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది.కొన్ని సమయాలలో చందనము లేదా విభూతి నుదుట రాయడమూ మంచిదే.

ఏ వేలితో పెట్టుకుంటే మంచిది? బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో వేలిని ఉపయోగించాలని చెబుతుంటారు.కొందరు మధ్య వేలు మంచిదని.

మరికొందరు ఉంగరపు వేలు మంచిదని.అయితే ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి, జ్ఞానం వస్తుంది.

Scientific Reason Behind Every Hindu Applying Kunkum On Forehead, Bottu , Tradit
గ్రీన్ టీ లో ఈ ఆకును కలిపి తీసుకుంటే డబుల్ హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి!

మధ్య వేలితో  పెట్టుకుంటే ఆయువు, సంపద వస్తాయని ప్రతీతి.చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని.అందుకే చూపుడు వేలుతో మాత్రం బొట్టు పెట్టుకోకూడదని చెబుతారు.

Advertisement

బొటన వేలితో పెట్టుకుంటే పుష్ఠి కలుగుతుంది. అలాగే బొట్టు పెట్టుకోవడం వల్ల అందం రెట్టింపవుతుంది.

చూడగానే మొహం చాలా కళగా కనిపిస్తుంది.బొట్టు పెట్టుకోని వారికంటే.

బొట్టు పెట్టుకున్న వారు మరింత అందగా కనిపిస్తారు.

తాజా వార్తలు