వైరల్: స్టూడెంట్స్ కి గిఫ్ట్స్ ఇచ్చిన స్కూల్ టీచర్.. ఏడ్చేసిన స్టూడెంట్స్.. ఆఖరికి ఇలా మార్చేశారు!

ఉపాధ్యాయులకు పాఠాలు బోధించడం ఒక్కటే వస్తే సరిపోదు.దానితోపాటు మరెన్నో కళలు చూపితేనే పిల్లలను మన వశం చేసుకోగలం.

తద్వారా వారు మనం చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటారు.ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏమంటే.

ఫ్రెండ్లీ నేచర్. ఆ ఒక్కటి ఉందంటే ఎలాంటి స్టూడెంట్ అయినా చెప్పినమాట వినాల్సిందే.

ఇక పిల్లలు కూడా అలాంటి టీచర్లును ఎంతో ఇష్టపడుతూ వుంటారు.స్కూల్ పిల్ల‌ల‌కి జీవించ‌డాన్ని నేర్పాలి.

Advertisement

ఆత్మ విశ్వాసం, ఆనందంతో పాటు నైపుణ్యాన్ని నేర్పాలి.అయితే, ప్రస్తుత సమాజంలో ఇలాంటి ల‌క్ష‌ణాలు కలిగిన టీచ‌ర్లు ఎంత మంది వుంటారు? వేళ్ళమీద లెక్కపెట్టాల్సిందే.ఇక మనం చెప్పుకోబేయే టీచర్ పై లక్షణాలన్నీ సమృద్ధిగా కలిగిన ఓ లేడీ టీచర్.

అమె నిరంతరం తన స్టూడెంట్స్ ని ఎంతో ఆనందంగా ఉంచుతుంది.ఓ ఫ్రెండ్లీ నేచర్ తో వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఈ టీచర్ తన విద్యార్థులకు సహాయం చేయడానికి వారి హృదయాలను గెలుచుకొనే ఓ ఐడియా వేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో స్కూల్ మిస్‌ తన తరగతిలో విద్యార్థులంద‌రికీ కొత్త షూలను బహుమతిగా ఇస్తుంది.

అలా కొత్త స్నీకర్లతో మొత్తం తరగతిని ఆశ్చర్యపరిచింది.@teachinthe6ix అనే ఇన్స్టా వేదికగా అప్లోడ్ అయిన సదరు వీడియోని నెటిజన్లు ఎంతగానో ఇష్టపడుతున్నారు.అమె మాట్లాడుతూ "నా విద్యార్థులలో అన్ని రకాలవారు వున్నారు.

Ashwini Dutt : నా కెరీర్ లో అత్యంత లాభాలు పొందిన సినిమా అదే

వీరిలో కొంతమందికి మనం తరచుగా పొందే షూస్ వంటి సాధారణ విలాసాలు ఉండవు!" అని చెప్పుకొచ్చింది.ఆమె ఇలా తన స్టూడెంట్స్ కి బ‌హుమ‌తులు ఇవ్వ‌డానికే నిధులు సేకరిస్తుందట.

Advertisement

ఇక‌, విద్యార్థులు తమకి లభించిన షూస్ ని డిజైన్ చేసి, ఆ అద్భుత‌మైన బ‌హుమ‌తిని మ‌రింత అద్బుతంగా అలంకరిస్తున్నారు చూడండి.సదరు వీడియో చూసిన నెటిజన్లు తమ జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకుంటున్నారు.

తాజా వార్తలు