Visakhapatnam : విశాఖ జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం.. మహిళ మృతి

విశాఖపట్నం జిల్లా( Visakhapatnam District )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.అదుపుతప్పిన ఓ స్కూల్ బస్సు రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో బస్సు టైర్ల కింద పడి ఓ మహిళ మృత్యువాత పడింది.ఎస్ కోట నుంచి ఆనందపురం వెళ్లే రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది.

వెంటనే గమనించిన స్థానికులు బస్సులో నుంచి స్కూల్ పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు.

అనంతరం సమాచారం అందుకున్న అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అయితే బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

Advertisement
వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?