Electoral Bonds : ఈసీకి ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు అందించిన ఎస్బీఐ..!

ఎలక్టోరల్ బాండ్స్( Electoral Bonds ) కు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్నికల సంఘానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించింది.

ఆల్ఫా న్యూమరిక్ నంబర్లు సహా ఎలక్టోరల్ బాండ్ల అన్ని వివరాలను ఎన్నికల కమిషన్ కు వెల్లడించినట్లు సుప్రీంకోర్టులో ఎస్బీఐ అఫిడవిట్ దాఖలు( SBI Affidavit ) చేసింది.

అయితే ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే బాండ్ల వివరాలను వెల్లడించడంలో సెలక్టివ్ విధానాన్ని మానుకోవాలని, రాజకీయ పార్టీకి బాండ్ల రూపంలో ఎంత విరాళం ఇచ్చారనేది తెలియజేసే యునిక్ బాండ్ నంబర్లతో( Unique Bond Numbers ) సహా పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీం ఆదేశాల నేపథ్యంలోనే ఎస్బీఐ పూర్తి వివరాలను ఈడీకి వెల్లడించింది.

Advertisement