ఈ షాంపూ హ్యాక్ తో చెప్పండి హెయిర్ ఫాల్ కు టాటా!

ఆడవారే కాదు ఎందరో పురుషులు కూడా హెయిర్ ఫాల్( Hair fall ) సమస్యతో తెగ సతమతమవుతుంటారు.జుట్టు రాలడాన్ని అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

ఖరీదైన షాంపూలను వాడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే షాంపూ హ్యాక్ ను కనుక ట్రై చేస్తే హెయిర్ ఫాల్ సమస్యకు టాటా చెప్పవచ్చు.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు టేబుల్ స్పూన్లు కడిగిన బియ్యం ( Rice )మరియు ఒక కప్పు వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మ‌రుసటి రోజు రైస్ వాటర్ ని ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి.మరోవైపు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అయ్యాక కప్పు కరివేపాకు, రెండు టేబుల్ స్పూన్లు మెంతులు ( fenugreek )వేసి పదినిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఇప్పుడు కరివేపాకు మెంతుల వాటర్ ని వాడ‌క‌ట్టి చల్లారపెట్టుకోవాలి.

Advertisement

గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో ఒక కప్పు రైస్ వాటర్ మరియు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు మీ రెగ్యులర్ షాంపూను వేసి బాగా మిక్స్ చేయాలి.

ఈ వాటర్ ను ఉపయోగించి హెయిర్ వాష్ కనుక చేసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.ముఖ్యంగా ఈ షాంపూ హ్యాక్ హెయిర్ ఫాల్ సమస్యను క్రమంగా దూరం చేస్తుంది.జుట్టు కుదుళ్లకు చక్కని పోషణ అందిస్తుంది.

హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారేలా ప్రోత్స‌హిస్తుంది.హెయిర్ ఫాల్ ను రెడ్యూస్ చేస్తుంది.

అలాగే ఈ షాంపూ హ్యాక్ ను ప్రయత్నించడం వల్ల స్కాల్ప్ శుభ్రంగా హైడ్రేట్ గా మారుతుంది.స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ తగ్గు ముఖం పడతాయి.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

చుండ్రు నుంచి విముక్తి లభిస్తుంది.ఆరోగ్యమైన మృదువైన‌ మెరిసే కురులు మీ సొంతం అవుతాయి.

Advertisement

తాజా వార్తలు