చుండ్రుకు శాశ్వతంగా గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా.. అందుకు ఇదే బెస్ట్ సొల్యూషన్!

చుండ్రు( Dandruff ) పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మందిని కలవరపెట్టే సమస్యల్లో ఇది ఒకటి.

పొడిబారిన చర్మం, ఫంగల్ ఇన్ఫెక్షన్, షాంపూ తగినంత వాడకపోవడం, సెబమ్ యొక్క అధిక ఉత్పత్తి, సూక్ష్మజీవులు, వాతావరణంలో వచ్చే మార్పులు తదితర అంశాలు చుండ్రుకు కారణం అవుతాయి.

అయితే చుండ్రు కారణంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.తలలో దురద, జుట్టు పొడిబారిపోవడం, జుట్టు అధికంగా ఊడిపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.

ఈ క్రమంలోనే చుండ్రును వదిలించుకునేందుకు ఖరీదైన షాంపూలను వాడుతుంటారు.

కానీ షాంపూలు కంటే కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తాయి.ముఖ్యంగా చుండ్రుకు శాశ్వతంగా గుడ్ బై చెప్పాలనుకునే వారికి ఇప్పుడు చెప్పబోయే రెమెడీ బెస్ట్ సొల్యూషన్ గా చెప్పుకోవచ్చు.మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

Advertisement

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మందారం పొడి, వన్ టేబుల్ స్పూన్ వేప పొడి, వన్ టేబుల్ స్పూన్ హెన్నా పొడి వేసుకోవాలి.అలాగే పావు కప్పు ఫ్రెష్ లెమన్ జ్యూస్( Lemon juice ) మరియు సరిపడా వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే తలలో చుండ్రు మొత్తం మాయమవుతుంది.

చుండ్రును వదిలించడానికి ఈ రెమెడీ చాలా అంటే చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది.అలాగే ఈ రెమెడీ జుట్టు రాలడాన్ని అరికడుతుంది.జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

పైగా ఈ రెమెడీని పాటిస్తే తెల్ల జుట్టు సైతం త్వ‌ర‌గా రాకుండా ఉంటుంది.

పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Advertisement

తాజా వార్తలు