Satya Dev: టాలీవుడ్ స్టార్స్ గురించి ఒక్క మాటలో చెప్పిన సత్యదేవ్.. ఏం చెప్పారంటే?

ఈ తరం హీరోలలో టాలెంట్ తో ప్రేక్షకులకు దగ్గరైన వాళ్లలో సత్యదేవ్ ఒకరు.

సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమా రిలీజ్ సందర్భంగా నెటిజన్లతో ట్విట్టర్ చాట్ చేసిన సత్యదేవ్ చాట్ లో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఫ్యాన్స్ నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు సంతోషిస్తున్నానని సత్యదేవ్ తెలిపారు.

భవిష్యత్తులో ఫ్యాన్స్ ను అలరించడానికి అబద్ధాలు చెబుతానని సత్యదేవ్ చెప్పుకొచ్చారు.యాక్టర్ కాకపోయి ఉంటే డైరెక్టర్ అయ్యేవాడినని ఆయన కామెంట్లు చేశారు.

తారక్ తో కలిసి నటించాలని నాకు కూడా ఉందని ఆ సందర్భం కోసం నేను కూడా ఎదురుచూస్తున్నానని అభిమానులు గట్టిగా కోరుకోవాలని సత్యదేవ్ కామెంట్లు చేశారు.అక్షయ్ కుమార్ తో రామ్ సేతు మూవీలో కలిసి నటించడం సంతోషాన్ని కలిగించిందని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

రామ్ సేతు మూవీ తర్వాత అక్షయ్ కుమార్ కు నేను ఫ్యాన్ అయిపోయానని సత్యదేవ్ కామెంట్లు చేశారు.

గుర్తుందా శీతాకాలం మూవీని ఓటీటీకి అడిగారని సత్యదేవ్ పేర్కొన్నారు.థియేటర్ లోనే ప్రేక్షకులు ఈ సినిమాను చూడాలని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.చిరంజీవితో కలిసి నటించడం మరిచిపోలేనని ఆయనతో పని చేయడం మేజికల్ గా అనిపించిందని సత్యదేవ్ అన్నారు.

టాలీవుడ్ స్టార్స్ గురించి ఏమైనా చెప్పాలని అడగగా ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ అని బన్నీ ఐకాన్ స్టార్ అని తారక్ టార్చ్ బేరర్ అని చరణ్ మోస్ట్ లవబుల్ స్టార్ ఇన్ ఇండియా అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫైర్ స్ట్రోమ్ అని సత్యదేవ్ కామెంట్లు చేశారు.సత్యదేవ్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.గుర్తుందా శీతాకాలం సినిమాతో సత్యదేవ్ హిట్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు