ఈ విలన్ ని అప్పట్లో ఓ కో డైరెక్టర్ అనకూడని మాటలతో తిట్టాడంట.. దాంతో..

ఒకప్పుడు తన విలనిజంతో తెలుగు, కన్నడ సినీ ప్రేక్షకులను ఎంతగానో భయపెట్టినటువంటి ప్రముఖ విలన్ సత్య ప్రకాష్ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అప్పట్లో సత్యప్రకాష్ విలన్ గా నటించిన పోలీస్ స్టోరీ, సమరసింహా రెడ్డి, జయం మనదేరా, అవతారం తదితర చిత్రాలు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకి బాగానే గుర్తుంటాయి.

 తాజాగా సత్య ప్రకాష్ ఓపెన్ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.ఈ ఇంటర్వ్యూ లో భాగంగా తాను సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఎదుర్కొన్నటువంటి పలు సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

Tollywood Actor Sathyapraksh Share His Life Movements With Social Media, Sathyap

మొదట్లో తాను చెన్నై నుంచి హైదరాబాద్ కి ఓ తెలుగు సినిమాలో విలన్ పాత్రలో నటించే అవకాశం రావడంతో ఇక్కడికి వచ్చానని తెలిపాడు.అయితే విలన్ గా తనకి మొదటి చిత్రం కావడంతో అప్పట్లో తనలో కొంతమేర భయం ఉండేదని దాంతో సరిగ్గా నటించలేక పోయానని,  దాంతో డైరెక్టర్ వేరే వాళ్ళని తీసుకొమ్మని చెప్పి తనని అక్కడి నుంచి పంపించేశాడని తెలిపాడు.

అయితే సరిగ్గా తాను బయటకి వెళుతున్న సమయంలో ఓ  కో డైరెక్టర్ వచ్చి తనకు వినపడే విధంగా తన ముందే అసభ్య పదజాలంతో దూషించాడని ఆ విషయం తనని అప్పట్లో ఎంతగానో బాధించిందని కొంతమేర ఎమోషనల్ అయ్యాడు.దాంతో అప్పుడే చాలా బలంగా సినిమా పరిశ్రమలో ఎలాగైనా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఫిక్స్ అయ్యానని అందుకోసం బాగానే కష్టపడ్డానని దాంతో కొద్ది కాలంలోనే విలన్ గా టాలీవుడ్ లో ఓ రేంజ్ కి ఎదిగానని చెప్పుకొచ్చాడు.

Advertisement

అయితే కొంతకాలం తర్వాత  తెలుగు సినిమాలో ప్రముఖ విలన్ గా నటిస్తున్న సమయంలో మళ్లీ ఆ కో-డైరెక్టర్ తనకి తారసపడ్డాడని ఆ సమయంలో తాను సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో తిట్టినటువంటి తిట్ల గురించి అతడికి గుర్తు చేసి దయచేసి కొత్త ఆర్టిస్టులను ప్రోత్సహించక పోయినా పర్లేదు కానీ వారిని కించ పరిచే విధంగా మాట్లాడొద్దని చెప్పాడట.  అయితే ఈ  విషయం ఇలా ఉండగా కొంతకాలం సినిమాలకి బ్రేక్ ఇచ్చిన సత్య ప్రకాష్ ఆ మధ్య టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ హీరోగా నటించినటువంటి 90 ఎమ్.ఎల్ చిత్రంలో హీరో తండ్రి పాత్రలో నటించాడు.

సంక్రాంతి నాడు గాలిపటం ఎందుకు ఎగుర వేస్తారు?
Advertisement

తాజా వార్తలు