2018 సౌత్‌ ఇండియా బిగ్గెస్ట్‌ మూవీ ఏదో తెలుసా.. కలెక్షన్స్‌ వివరాలు

ఈమద్య కాలంలో సౌత్‌ ఇండియన్‌ మూవీ మార్కెట్‌ భారీగా పెరుగుతుంది.భారీ ఎత్తున సౌత్‌ చిత్రాలు వసూళ్లు సాధిస్తూ అందరికి షాక్‌ ఇస్తున్నారు.

బాలీవుడ్‌ సినిమాలతో పోటీ పడుతూ మరీ కొన్ని తెలుగు మరియు తమిళ సినిమాలు దూసుకు పోతున్నాయి.ఇక ఈ ఏడాదిలో సౌత్‌లో బిగ్గెస్ట్‌ సక్సెస్‌ మూవీగా మొన్నటి వరకు రంగస్థలం ఉంది.

దాదాపు 220 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను ఆ చిత్రం వసూళ్లు చేసింది.రంగస్థలం మొదటి స్థానంను దక్కించుకున్న ‘సర్కార్‌’ చిత్రం ఇప్పుడు నెం.1 స్థానంలో నిలిచింది.

ఈ ఏడాది ఇప్పటి వరకు బిగ్గెస్ట్‌ మూవీగా సర్కార్‌ నిలిచింది.దాదాపు 250 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను ఈ చిత్రం దక్కించుకున్నట్లుగా కోలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.150 కోట్ల షేర్‌ను ఈ చిత్రం రాబట్టినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విజయ్‌ మరోసారి తన సత్తా చాటాడు.

Advertisement

అంద్బుతమైన ట్రాక్‌ రికార్డు కలిగి ఉన్న విజయ్‌, మురుగదాస్‌ల కాంబోలో ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెల్సిందే.

ఇప్పటికే విడుదలైన వీరి కాంబో మూవీలు రెండు మంచి విజయాలను దక్కించుకున్నాయి.తాజాగా ఈ చిత్రంతో మరోసారి ఈ జంట భారీ బ్లాక్‌ బస్టర్‌ను దక్కించుకుంది.సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కూడా సినిమా అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను అవమానించే విధంగా ఉంది అంటూ పుకార్లు రావడంతో భారీగా వసూళ్లు సాధించింది.అయితే సర్కార్‌ నెం.1 స్థానం మరి కొన్ని రోజుల్లోనే నెం.2 గా మారబోతుంది.ఎందుకంటే 2.ఓ చిత్రం విడుదలతో అన్ని రికార్డులన్ని కూడా తలకిందులు కాబోతున్నాయి.

Advertisement