సరిలేరు నీకెవ్వరు 19 డేస్ కలెక్షన్లు.. నెమ్మదించిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి సందర్భంగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఈ సినిమాతో మహేష్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను తన పేరిటి రాసుకున్నాడు.

కాగా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు ఎగబడ్డారు.మహేష్ యాక్టింగ్, లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి డైనమిక్ రీఎంట్రీ, అనిల్ రావిపూడి టేకింగ్ కలగలిసి ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట చేశాయి.

Sarileru Neekevvaru 19 Days Collections-సరిలేరు నీకెవ�

కాగా ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు సంక్రాంతి పండగ సెలవులు కావడంతో లాంగ్ వీకెండ్ కలెక్షన్లు బాగా కలిసొచ్చాయి.ఈ సినిమా రిలీజ్ అయ్యి 19 రోజులు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.133 కోట్ల మేర వసూళ్లు సాధించింది.ఈ కలెక్షన్లు క్రమంగా తగ్గుముఖ్యం పట్టినా, బాక్సాఫీస్ వద్ద సరైన చిత్రాలు లేకపోవడంతో మహేష్ సినిమాను చూసేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు.

రష్మిక మందన హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.ఇక ఏరియాల వారీగా ఈ సినిమా 19 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.నైజాం - 37.57 కోట్లు సీడెడ్ - 15.10 కోట్లు గుంటూరు - 9.60 కోట్లు ఉత్తరాంధ్ర - 18.97 కోట్లు ఈస్ట్ - 10.97 కోట్లు వెస్ట్ - 7.22 కోట్లు కృష్ణా - 8.58 కోట్లు నెల్లూరు - 3.89 కోట్లు టోటల్ ఏపీ+తెలంగాణ - 111.90 కోట్లు కర్ణాటక - 7.41 కోట్లు రెస్టాఫ్ ఇండియా - 1.81 కోట్లు ఓవర్సీస్ - 11.88 కోట్లు టోటల్ వరల్డ్ వైడ్ - 133.00 కోట్లు.

Advertisement
ఖాళీ కడుపుతో జ్యూస్ తాగుతున్నారా?... ఈ విషయాలు తెలుసుకోండి!

తాజా వార్తలు