ఎన్నికల్లో గెలవలేనందుకు టీడీపీ నేతలు చీరలు కట్టుకోవాలంటూ మంత్రి ఆర్‌కే రోజా చేసిన వ్యాఖ్యలకు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఎన్నికల్లో గెలుపోటముల గురించి తెలియని నువ్వు లోకేశ్ ఓటమి గురించి మాట్లాడటం సిగ్గుచేటు.
విశాఖలో విజయమ్మను మీ నాయకుడు ఓడించాడా.లేక ఆమె ఓడిపోయిందా? మూడేళ్లలో ముక్కుపచ్చలారని పసివాళ్లు మొదలు, ముసలివాళ్ల వరకు అందరినీ ఉన్మాదులకు బలి చేసిన మీ నాయకుడు ఏ రంగు చీర కట్టుకోవాలో చెప్పండి అంటూ వంగలపూడి అనిత సవాల్ విసిరారు.మహిళా సాధికారతంటే నీలాంటి ఆడవాళ్లతో చంద్రబాబు, లోకేశ్‌లను బూతులు తిట్టించడం.
జబర్దస్త్ స్కిట్లలో డబుల్ మీనింగ్ డైలాగులకు నవ్వురాకపోయినా పడిపడినవ్వి రెమ్యునరేషన్ తీసుకోవడం కాదమ్మా.రోజమ్మా అంటూ వంగలపూడి అనిత సెటైర్లు వేశారు.
చంద్రబాబు హయాంలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ అంటూ పదేపదే ఆరోపణలు చేస్తున్న మంత్రి రోజా ఇప్పటి వరకు ఎందుకు కేసు విచారణ చేపట్టలేదని.మూడేళ్లుగా మీ ప్రభుత్వం గాడిదలు కాస్తుందా అని మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత నిలదీశారు.
వైసీపీ నేతలు, ఆ పార్టీని సమర్థించే పేటీఎమ్ కుక్కల నిరాశ, నిస్పృహలు చూస్తుంటే, చేయాల్సిన నీచాలన్నీ చేస్తూ కూడా వారు చెప్పే సూక్తులు వింటుంటే జుగుప్స కలుగుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్యాంగురాలిపై జరిగిన అత్యాచార ఘటనను తన రాజకీయానికి వాడుకోవాలని చూసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మెడకే చుట్టుకుందని ఆమె మెడకు ఇప్పుడు 800 కేసులు చుట్టుకున్నాయని విమర్శించారు.
చంద్రబాబు, లోకేశ్‌లను ఇరికించాలని ప్రయత్నించి అడ్డంగా బుక్కైందని మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఆరోపించారు.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఓడిపోయాడంటూ తీవ్ర విమర్శలు చేస్తున్న రోజా ఒకప్పుడు ఆమె కూడా ఓడిపోయిందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని.అంతేకాదు విశాఖపట్నంలో వైఎస్ విజయమ్మ కూడా ఓడిపోయారు.
లోకేశ్ ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యే తిరుగుతున్నారు.మీ నాయకుడు బయటకు రావాలంటే వేల మంది పోలీసులు, ఇనుప కంచెలు, భారీ భద్రతా వలయంలో ఉండాలి.
కానీ లోకేశ్‌కు అవేమీ అవసరం లేదు.ప్రజల ముఖం చూడటానికి భయపడుతూ రోడ్ల మీదకు వస్తున్న మీ సీఎం ఏ రంగు చీర కట్టుకోవాలో నువ్వే చెప్పమ్మా.
ఆర్టిస్టమ్మా రోజా అంటూ వంగలపూడి అనిత సెటైర్లు వేశారు.
మీ పార్టీ రంగుతో కూడిన బ్లూ చీర పంపించమంటే పంపిస్తాం అని చెప్పుకొచ్చారు.మేం చీరల గురించి మాట్లాడటానికి కారణం మీ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మేనని చెప్పుకొచ్చారు.వైసీపీ మహిళా నేతలు, మహిళా మంత్రులు మహిళా సాధికారత జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని చెబుతుంటే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు.
మహిళా సాధికారత అంటే కచ్చా బాదం డాన్స్ లువేయడం.జబర్దస్త్ షో లో డబుల్ మీనింగ్ డైలాగులకు నవ్వురాకపోయినా వికవికా.పకపకా నవ్వుతూ రెమ్యునరేషన్ తీసుకోవడం కాదని.
పిచ్చిపిచ్చి స్కిట్‌లు చేయడం కాదని తెలుసుకోండమ్మా అంటూ వంగలపూడి అనిత హితవు పలికారు.ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన వెంకటరెడ్డిని పట్టుకొని శిక్షించలేని దుస్థితిలో మీ ప్రభుత్వం ఉంది.
ఇందుకు ఎవరు చీర కట్టుకోవాలో చెప్పండి అని మంత్రి రోజాను వంగలపూడి అనిత ప్రశ్నించారు.భర్త కళ్లెదుటే ఆడబిడ్డపై మానభంగం జరిగితే నిందితులను శిక్షించలేని సీఎం చీరకట్టుకోవా లా.లేక తామా? అభంశుభం తెలియని మానసిక దివ్యాంగురాలిపై 30 గంటలపాటు అందరూ తిరుగుతున్న సమయంలోనే పట్టపగలే అత్యాచారం జరిగితే మీ ముఖ్యమంత్రి, మీ అధికార యంత్రాంగం ఏంచేసిందమ్మా? ఆ అభాగ్యురాలిని కనీసం వెళ్లి పలకరించలేని మీ ముఖ్యమంత్రి చీర కట్టుకోవాలా.లేక తామా? చూడమ్మా పెయిడ్ ఆర్టిస్టూ .ఎప్పుడో జరిగిన సెక్స్ రాకెట్ గురించి, కాల్ మనీ వ్యవహారం గురించి మాట్లాడటంకాదు.అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఎందుకు అసలైన వారిని పట్టుకొని శిక్షించ లేకపోయారు? అని వంగలపూడి అనిత ప్రశ్నించారు.
ఊరికో ఉన్మాది అంటే ఉలుకొచ్చిందా? ఎందుకంతలా ఉలిక్కిపడుతున్నారు రోజమ్మా.మీ పార్టీలో ఉన్మాదులను నేను చూపిస్తా అంటూ వంగలపూడి అనిత చెప్పుకొచ్చారు.మాట్లాడితే డ్వాక్రా అక్కచెల్లెమ్మల గురించి చెబుతున్నారు.
డ్వాక్రా మహిళల్నిగానీ, సంఘాల్ని గానీ బలోపేతం చేసింది.వారికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది చంద్రబాబు.టీడీపీ హయాంలో ప్రతి డ్వాక్రా మహిళకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తే.మీరు చచ్చీచెడి రూ.14 వేలు ఇవ్వడానికే కిందా మీదా పడ్డారు.ఆ సొమ్మైనా అందరికీ ఇచ్చారా అంటే అదీ లేదు.చివరకు డ్వాక్రా మహిళల పొదుపు సొమ్ము రూ.2 వేల కోట్లను సీఎం జగన్ కాజేశాడు అని వంగలపూడి అనిత మండిపడ్డారు.జగన్ రెడ్డిని.
ఆయన భార్య భారతిని ఏమైనా అంటే ఊరుకోరా? ఏమ్మా.అంతలా పొడుచుకొస్తుందా? మేం మాట్లాడుతూనే ఉంటాము.ఆడబిడ్డలను, అభం శుభం తెలియని చిన్నారులను కాపాడలేని అసమర్థ సీఎం గురించి ఇలానే మాట్లాడతామని వంగలపూడి అనిత హెచ్చరించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy