సర్దార్‌ రెండో రోజు పరిస్థితి

ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్‌ కాలేదు అని చెప్పాలి.

మెగా ఫ్యాన్స్‌కు పర్వాలేదు అనిపించేలా ఉన్నా కూడా సాధారణ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను జీర్ణించుకోలేక పోతున్నాడు.

మొదటి రోజు టాక్‌ ఎలా ఉన్నా కూడా కలెక్షన్స్‌ మాత్రం దుమ్ము దుమ్ముగా వచ్చాయి.మొదటి రోజు పలు ఏరియాల్లో ‘శ్రీమంతుడు’ కలెక్షన్స్‌ను సర్దార్‌ క్రాస్‌ చేశాడు.

భారీ స్థాయిలో అంచనాలున్న సర్దార్‌ను మొదటి రోజు ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా చూసేందుకు ఎగబడ్డారు.దాంతో కోట్లల్లో కలెక్షన్స్‌ వచ్చాయి.

ఇక రెండవ రోజు చిత్రం కలెక్షన్స్‌ దారుణంగా ఉన్నాయి.సినిమాకు నెగటివ్‌ టాక్‌ రావడంతో రెండవ రోజు పెద్దగా ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించలేదు.

Advertisement

ఇక ఈరోజు ఆదివారం అయినా కూడా సర్దార్‌కు కలెక్షన్స్‌ అంతంత మాత్రంగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.మొత్తానికి సర్దార్‌ సందడి కేవలం ఒక్క రోజు వరకు మాత్రమే సాగింది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను భారీ మొత్తం పెట్టి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు.నిర్మాత పరిస్థితి అట్లుంచి, డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా వల్ల తీవ్ర స్థాయిలో నష్టపోవడం ఖాయం అంటూ ట్రేడ్‌ వర్గాల వారు విశ్లేషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు