పెళ్లికాని ప్రేమ్ కుమార్ గా అలరించబోతున్న సంతోష్ శోభన్

ఏక్ మినీ కథ మూవీతో హీరోగా ఫస్ట్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న నటుడు సంతోష్ శోభన్.

యువి కాన్సెప్ట్స్ బ్యానర్లో వచ్చిన ఈ మూవీ అడల్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది.

ఇక స్టైల్ సంతోష్ శోభన్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తో మెప్పించాడు.ఇదిలా ఉంటే సంతోష్ శోభన్ సంబంధించిన కొత్త సినిమాని తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో చిత్ర నిర్మాతలు ఎనౌన్స్ చేశారు.

Santosh Sobhan New Movie Prem Kumar First Look Released, Tollywood, Ek Mini Kath

ప్రేమ్ కుమార్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది.ఈ మూవీలో పెళ్లి కానీ యువకుడి పాత్రలో సంతోష్ కనిపించబోతున్నాడు.

తెలుగు సినిమాల్లో క్లైమాక్స్ సన్నివేశాల్లో హీరో హీరోయిన్ల పెళ్లి తర్వాత ఒంటరైపోయే పెళ్ళికొడుకు తరహా క్యారెక్టరైజేషన్ లో అతని పాత్ర ఫుల్ ఫన్ రైడ్ క్రియేట్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది.సినిమాల్లో ఈ పాత్రను చూసినపుడు చాలామంది సెటైరికల్ గా జోక్స్ వేసుకోవడం కామన్ గా కనిపిస్తుంది.

Advertisement

ఇప్పుడు దాన్ని మెయిన్ స్టొరీ లైన్ గా తీసుకొని అభిషేక్ మహర్షి సంతోష్ శోభన్ తో ప్రేమ్ కుమార్ మూవీని తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ 80% షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తుంది.

లాక్‌డౌన్‌ తర్వాత మిగిలిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ చేస్తామని చిత్ర దర్శకుడు తెలియజేశారు.ఈ సినిమాలో సంతోష్ శోభన్ కి జోడిగా రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఏక్ మినీ కథ హిట్ తో ఇప్పుడు ప్రేమ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి హైప్ వచ్చింది.ఈ మూవీ కూడా కామెడీ ఎంటర్టైనర్ గానే తెరకెక్కనుండటంతో మరో హిట్ ని సంతోష్ తన ఖాతాలో వేసుకోవడం పక్కా అనే మాట వినిపిస్తుంది.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal
Advertisement

తాజా వార్తలు