క‌రీంన‌గ‌ర్ కు బండి సంజ‌య్ త‌ర‌లింపు..

బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ ను పోలీసులు క‌రీంన‌గ‌ర్ లోని ఆయ‌న నివాసానికి త‌ర‌లించారు.జ‌న‌గామ జిల్లాలో బండి సంజ‌య్ దీక్ష‌ను భ‌గ్నం చేసి.

ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే.అనంత‌రం బండి సంజ‌య్ ను క‌రీంన‌గ‌ర్ కు త‌ర‌లించారు.

మ‌రోవైపు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ ల అరెస్ట్ పై పార్టీ అధిష్ఠానం ఆరా తీస్తోంది.తెలంగాణలో ప్రస్తుత పరిస్థితిపై వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది.

దీనిలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇత‌ర బీజేపీ పెద్దలు సంజయ్ కు ఫోన్ చేశారు.ధైర్యం కోల్పోవద్ద‌ని చెప్పారు.

Advertisement

ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలపై పోరాటాన్ని కొనసాగించాలని సూచించారు.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?
Advertisement