ట్విట్టర్ టిల్లు అంటూ రెచ్చిపోయిన సంజయ్ !

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తన నోటికి పని చెప్పారు.

తనను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలు పై సంజయ్ ఘాటుగా స్పందించారు.

కెసిఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు నన్ను కెలకాలనుకుంటున్నాడు.నేను ఊరుకుంటానా,  అంతకంటే ఎక్కువగా కెలుగుతాను అంటూ బండి సంజయ్ సంచలన విమర్శలు చేశారు.

  మేడ్చల్ జిల్లా దుండిగల్ గండి మైసమ్మ మండలంలోని కొంపల్లి గ్రామంలో జరిగిన ఉపాధ్యాయ,  అధ్యాపక, ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సంజయ్ ఈ సందర్భంగా కేటీఆర్, కవితలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.తనపై 18 మంది ఇంటిలిజెన్స్ సిబ్బందితో నిఘా పెట్టారని,  బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై స్పందించిన సంజయ్ ఆమె ఎంపీగా ఉన్న సమయంలో,  పార్లమెంటులో ఒక్కసారి కూడా మహిళా బిల్లు గురించి మాట్లాడలేదని,  పార్లమెంట్ లో మహిళా బిల్లు కాపీలను చించేసిన సమాజ్ వాదీ పార్టీ , ఆర్జేడి పార్టీలను వెంటేసుకుని మహిళా బిల్లు కోసం కవిత దీక్ష చేయడం సిగ్గుచేటు అని సంజయ్ విమర్శించారు.కెసిఆర్ బిడ్డ మీద ఈడీ , సిబీఐ విచారణలు చేస్తుంటే మాత్రం స్పందిస్తారు.మరి ఇతరుల మీద ఆరోపణలు వస్తే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

Advertisement

కవిత మహిళా బిల్లుపై చేస్తున్న దీక్షను చూసి జనం నవ్వుకుంటున్నారని,  కెసిఆర్ బిడ్డ చేసిన దొంగ సారా దందా వల్ల తెలంగాణ ప్రజలు తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని సంజయ్ మండిపడ్డారు.తెలంగాణ వచ్చాక ఏం జరిగింది? 2014 ముందు మద్యం ద్వారా 10 కోట్లు మాత్రమే వస్తే,  కేసీఆర్ పాలనలో మద్యాన్ని ఏరులై పారించి 40,000 కోట్ల ఆదాయం సంపాదిస్తున్నారు.ఆయన తెలంగాణ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి పరిస్థితిని తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ప్రధాని నరేంద్ర మోది గత మూడు నెలల్లో 2.16 లక్షల ఉద్యోగాలు ఇస్తే,  కెసిఆర్ మాత్రం ఇంటికో ఉద్యోగం అని ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. దళిత బంధు,  రుణమాఫీ,  ఫ్రీ యూరియా,  నిరుద్యోగ భృతి హామీలు అమలు చేయలేదని, ఒకటో తారీకు కూడా జీతాలు ఇవ్వలేని దుస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు.

  బిజెపి అధికారంలోకి వస్తే ఒకటవ తేదీన జీతాలు ఇచ్చే బాధ్యత మాదని , పెండింగ్ డిఏ లన్ని నెలలోనే ఇస్తామని,  వెంటనే పిఆర్సి వేస్తామని,  317 జీవోను సవరించి స్థానికత ఆధారంగా ఉద్యోగ ఉపాధ్యాయులను బదిలీ చేస్తామని సంజయ్ హామీ ఇచ్చారు .మాపై బీఆర్ఎస్ ఎన్నో దాడులు చేయించిందని , లాఠీచార్జులు చేశారని,  జైల్లో వేశారని అయినా ఏ ఉపాధ్యాయ సంఘం కూడా కేసీఆర్ కు భయపడి తమకు మద్దతు ఇవ్వలేదని, అయినా మేము భయపడలేదని టీచర్ల పక్షాన నిలబడుతున్నామని సంజయ్ అన్నారు.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు
Advertisement

తాజా వార్తలు