జగన్ ప్రభుత్వాన్ని పారిశుద్ధ్య కార్మికులే ఊడ్చేస్తారు..: టీడీపీ ఎమ్మెల్యే అనగాని

ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు.

కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివన్న ఆయన వారితో సీఎం జగన్ చెలగాటమాడుతున్నారని విమర్శించారు.

ఈ క్రమంలో రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని పారిశుద్ధ్య కార్మికులే ఊడ్చేస్తారని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.పనికి తగిన వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్న జగన్ ప్రభుత్వం కార్మికుల ఆగ్రహజ్వాలల్లో కాలిపోక తప్పదని చెప్పారు.

Sanitation Workers Will Sweep Jagan's Government..: TDP MLA Angani-జగన్

ఈ నేపథ్యంలో ఇప్పటికైనా వైసీపీ సర్కార్ నిర్లక్ష్యాన్ని వీడి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

పైనాపిల్ చేసే మ్యాజిక్.. ఇలా వాడారంటే స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు