భారీ వర్షాలకు నీట మునిగిన సంగమేశ్వర ఆలయం

నంద్యాల: నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటైన సంగమేశ్వర ఆలయం జలదివాసమైనది.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా చేరడంతో ఆలయం నీట మునిగింది.

దీంతో సప్తనది సంగమ తీరంలో వెలిసిన సంగమేశ్వరుడు కృష్ణమ్మ ఒడిలోకి చేరుకున్నాడు.ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ ఆధ్వర్యంలో అంత్య పూజా క్రతువులు ఆలయంలోని వేప దారి శివలింగంకు పూజలు నిర్వహించారు.

ఈ ఆలయం ఇప్పుడు మునిగితే బయటికి వచ్చేందుకు మరో ఏడాది పట్టే అవకాశం ఉంటుంది.ప్రతిఏటా ఇది ఓ అద్భుత ఘటం.నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 40కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది.ఏకంగా ఏడునదులు కలిసే ప్రదేశం.

ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం ఉంటుంది.

Advertisement
ఉప‌వాసం స‌మ‌యంలో పాలు తాగితే ఏం అవుతుందో తెలుసా?

తాజా వార్తలు