పాతిక లక్షల సహాయం అబద్దం.. కాంగ్రెస్ రెబల్ లీడర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

అల్లు అర్జున్ (Allu Arjun)నటించిన పుష్ప 2(Puspa 2) సినిమా ఇటీవల డిసెంబర్ 5న విడుదలైన విషయం తెలిసిందే.

ప్రీమియర్ షో (Premiere show)నేపథ్యంలో హైదరాబాదులోని సంధ్యా థియేటర్(Allu Arjun) వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలలో రేవతి(Revathi) అనే ఒక మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.ఇక అలాగే తొమ్మిదేళ్ల శ్రీతేజ్ అనే బాలుడి ఆరోగ్యం పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉంది.

అప్పటినుంచి ఇప్పటివరకు హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు శ్రీతేజ్.అయితే ఈ ఘటనపై స్పందించిన పుష్ప మూవీ మేకర్స్ అలాగే అల్లు అర్జున్ వారికి న్యాయం చేస్తామని తెలిపిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా చనిపోయిన మహిళ రేవతి(Revathi) కుటుంబానికి 25 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందించారని కూడా తెలిపారు.అయితే అందులో వాస్తవం లేదని కాంగ్రెస్ రెబల్ లీడర్(Congress rebel leader) బక్క జడ్సన్ అన్నారు.తాజాగా బక్క జడ్సన్ మీడియాతో మాట్లాడుతూ.రూ.25 లక్షల ఆర్థిక సహాయం అబద్దమని అన్నారు.కేవలం రూ.10 లక్షల సహాయం మాత్రమే బాధితులకి అందిందని అన్నారు.ఇక శ్రీతేజ్(Sreetej) వైద్య ఖర్చులు కూడా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని సీపీ సీవీ ఆనంద్ అన్నారు.

Advertisement

దీంతో అన్ని విధాల ఆదుకుంటామని చెప్పిన అల్లు ఫ్యామిలీ ఏం చేసింది అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై బక్క జడ్సన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు అల్లు అర్జున్ ఫ్యామిలీ (Allu Arjun Family)పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.అన్ని కోట్లు ఉన్నవారికి 25 లక్షలు సహాయం చేయడానికి మీ దగ్గర డబ్బులు లేవా అంటూ మండిపడుతున్నారు.అయితే ఈ ఘటనపై అల్లు అర్జున్ స్పందిస్తూ.

శ్రీతేజ్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.ప్రస్తుతం అతడిని కలవలేక పోతున్నాను.

వాళ్ల ఇంటికి వెళ్లలేకపోతున్నాను.త్వరలోనే వారి కుటుంబాన్ని కలిసి మాట్లాడతాను.

మరోమారు సాధువును దర్శించుకున్న కోహ్లీ దంపతులు.. (వీడియో)
సుకుమార్ ఇండస్ట్రీకి రావడానికి స్పూర్తి ఆ హీరోనా.. ఈ షాకింగ్ విషయం తెలుసా?

వారిని ఆదుకుంటానని ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాను.బాధిత కుటుంబానికి రూ.25లక్షలు సాయం అందిస్తాను.చికిత్స ఖర్చు భరిస్తాను.

Advertisement

ఆ కుటుంబానికి అండగా ఉంటాను అని ప్రకటించిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఆ వీడియోని మరోసారి వైరల్ చేస్తూ ఆ మాటలను ఎక్కడికి వెళ్లాయి.

ఉత్త మాటలు చెప్పడం కాదు చేసి నిరూపించాలి అంటూ అల్లు అర్జున్ పై ట్రోల్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు